చంద్రబాబుకు ఎపుడూ మాట్లాడేందుకు నాలుగు బుర్రలు కావాలని సెటైర్లు ఉన్నాయి. అది పార్టీ మీటింగు అయినా, మీడియా సమావేశం అయినా, ఆఖరుకు అధికారుల సమావేశం అయినా, ఇక బహిరంగ సభలు సరే సరి. ఎక్కడైనా కనీసం గంట పాటు అయిన ఉపన్యాసం దంచందే బాబుకు నిద్ర పట్టదని కూడా అంటారు.
అటువంటి బాబు తొమ్మిది నెలల వైసీపీ పాలనపైన నిత్యం మీడియాతోనే ఉన్నారు. జనంలోకి వచ్చారు. ఆయన ఓడాక నోరు ఎక్కడ కట్టేసుకున్నారని…ఆయిన దానికీ కాని దానికీ ఇలా ప్రతీ రోజూ ఏదో దానిపైన బాబు అండ్ కో నానా యాగీ చేస్తున్నదీ అంతా చూస్తున్నారు.
ఇపుడు కొత్తగా చెప్పేదేంటో తెలియదు కానీ బాబు బస్సు యాత్ర అంటున్నారు. ఈ నెల 19 నుంచి ఆయన ప్రజా చైతన్య యాత్ర పేరిట పదమూడు జిల్లాలూ తిరుగుతారుట. ఇది బాగానే ఉంది కానీ బాబు ఎందుకు తిరుగుతున్నారు ఆయన ఎవరిని చైతన్యం చేద్దామని వైసీపీ నాయకులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు.
బాబు అమరావతి కధలు చెప్పి జనాలను రెచ్చగొట్టడానికేనా ఈ బస్సు యాత్రలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడుతున్నారు. బాబుకు అభివ్రుధ్ధి అవసరం లేదని, ఎంతసేపూ స్వార్ధ రాజకీయమే ఆయనదని బొత్స ఘాటు కామెంట్స్ చేస్తున్నారు.
పదమూడు జిల్లాలనూ అభివ్రుధ్ధి చేయాలని ఓ వైపు జగన్ ఆలోచన చేస్తూంటే బాబు మాత్రం అమరావతిలోనే అన్నీ ఉంచమని ఊర్లు పట్టుకుతిరుగుతారా అని బొత్స సెటైర్లు వేస్తున్నారు. మీ యాత్రలు ఇపుడు జనాలకు అవసరం లేదు బాబూ అంటున్నారు బొత్స.