‘అప్పుడంటే పారిపోయి తల దాచుకునేందుకు అమరావతి రెడీగా ఉండింది. ఇప్పుడు అమరావతి నుంచి మరెక్కడికి పోతాడో…పాపం’ అనే సానుభూతి, వ్యంగ్య ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదంతా మన 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబు గురించే. అదాయపు పన్నుశాఖ ప్రాథమికంగా తేల్చిన రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీల వ్యవహారం బయటికొచ్చిన నేపథ్యంలో ‘బాబుకు తప్పించుకునే దారేదీ?’ అనే ప్రశ్న అందరి నోట.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేర్వేరుగా 2014లో ఏర్పడ్డ విషయం తెలిసిందే. విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేర్చారు. ఇప్పటికీ హైదరాబాదే ఏపీ అధికార రాజధాని. అయితే నాటి ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ పాలన సాగించకుండా, తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టాడు.
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నేటి కాంగ్రెస్ ఎంపీ, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తమ అభ్యర్థికి ఓటు వేయాలని అప్పటి ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టాడు. ఇందులో భాగంగా రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి తెలంగాణ ఏసీబీ అధికారులు వీడియోలు కూడా తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసులో రేవంత్‌రెడ్డి కొన్ని రోజులు జైల్లో ఊచలు లెక్కపెట్టాడు.
ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు 2016లో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు. మరోవైపు ‘బ్రహ్మ దేవుడొచ్చినా నిన్ను కాపాడలేడు బాబు’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అకస్మాత్తుగా 2015 అక్టోబర్‌లో చంద్రబాబు అమరావతికి మకాం మార్చాడు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ సర్కార్ ముందుకు వెళ్లకుండా ఉండేందుకు…బాబు హైదరాబాద్‌ను విడిచి పెట్టాలనే కండీషన్‌పై అమరావతికి పారిపోయాడని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
తాజాగా ఐటీ పన్నులశాఖ ఉచ్చులో నెమ్మదిగా ఇరుక్కుంటున్న చంద్రబాబు….ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ఎక్కడికి పారిపోతాడనేది ప్రధాన ప్రశ్న. చెడపకురా చెడదువు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఒకప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌ను కేసుల్లో ఇరికించామని సంబరపడ్డ చంద్రబాబు….ఇప్పుడు అంతకంటే తీవ్రమైన ఆర్థిక అభియోగాల కేసుల్లో చిక్కుకుంటున్నాడు. మరి ఇప్పుడు తప్పించుకునేందుకు బాబు దారేదీ?