బీజేపీలో అంతర్మథనం.. సొంత పార్టీలోనే అసమ్మతి స్వరం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఘోర ఓటమి నేపథ్యంలో బీజేపీలో అంతర్మథనం మొదలైంది. సీఏఏ, ఎన్ఆర్సీలపై మరీ దూకుడుగా వెళ్లడంతోనే ఇలాంటి పరాభవం ఎదురైందని, ఇప్పటికైనా వీటిపై పునరాలోచించాలని ఉదారవాదులు డిమాండ్ చేస్తున్నారు. గొప్పల కోసం…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఘోర ఓటమి నేపథ్యంలో బీజేపీలో అంతర్మథనం మొదలైంది. సీఏఏ, ఎన్ఆర్సీలపై మరీ దూకుడుగా వెళ్లడంతోనే ఇలాంటి పరాభవం ఎదురైందని, ఇప్పటికైనా వీటిపై పునరాలోచించాలని ఉదారవాదులు డిమాండ్ చేస్తున్నారు. గొప్పల కోసం ఎన్ని పథకాలైనా పెట్టొచ్చు కానీ, అవి తిప్పలు తేకుండా ఉంటే మంచిదని, ఓట్లు రాల్చని ఇలాంటి చట్టాల వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని తేల్చిచెబుతున్నారు.

ఢిల్లీ ఓటమిపై తాజా అధిపతి జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో కూడా ఇదే తేలింది. అయితే బైటకి మాత్రం ద్విముఖ పోరు వల్లే తాము నష్టపోయామని ప్రకటించారు నడ్డా. అంటే కాంగ్రెస్ బలంగా లేకపోవడం వల్ల బీజేపీ నష్టపోయిందనే వితండ వాదన చేశారు. ఇక పాతకాపు అమిత్ షా మాత్రం కొత్త కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. సీఏఏ లాంటి చట్టాల వల్ల తాము ఓడిపోలేదని, దానికి కారణాలు వేరే ఉన్నాయంటూ తమ నిర్ణయాలను సమర్థించుకునే పనిలో పడ్డారు అమిత్ షా. ఎన్నికల ప్రచారంలో గోలీమార్, ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ వంటి వ్యాఖ్యల్ని కొందరు చేశారని, అవి తమకు తీవ్ర నష్టాన్ని కలిగించాయని చెప్పుకొచ్చారు.

కొత్త అధ్యక్షుడైనా, పాత అధ్యక్షుడైనా లాజిక్ లేకుండా మాట్లాడటమే బీజేపీ నేతల్ని విస్మయానికి గురి చేస్తోంది. ఢిల్లీలో కేజ్రీవాల్ పాలన బాగానే ఉంది, కాదనడం లేదు. కేంద్రంలో బీజేపీ పాలన బాగుంటే.. కనీసం ఢిల్లీ అసెంబ్లీలో చెప్పుకోదగ్గ సీట్లయినా వచ్చేవి కదా. అంటే కేంద్రంలో బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజామోదం లేదనే విషయం అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలో సీఏఏ వంటి చట్టాలపై పునరాలోచించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ పరాజయం తర్వాత వీరి స్వరం మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే పశ్చిమబెంగాల్ ఎన్నికలకు ఎలా సన్నద్ధమవ్వాలనే విషయంపై కమలదళం మల్లగుల్లాలు పడుతోంది. గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ లో బీజేపీ 42 స్థానాల్లో ఏకంగా 18 స్థానాలను గెలుచుకుంది. అయితే ఆనవాయితీ ప్రకారం ఈసారి అసెంబ్లీలో తడబడతామేమోనని వారికి భయం. పైగా ఈసారి పశ్చిమబెంగాల్ లో భౌగోళికంగా సీఏఏ, ఎన్ఆర్సీలు గట్టిగా ప్రభావితం చూపించబోతున్నాయి.

మరోవైపు రాష్ట్రాలన్నీ సీఏఏ, ఎన్ఆర్సీలను ఏకపక్షంగా తిరస్కరిస్తున్న వేళ.. బీజేపీ అధిష్టానం ఎలా ముందుకెళ్తుందో చూడాలి. సొంతపార్టీలోని అసమ్మతి స్వరాల్ని ఎలా బుజ్జగిస్తారో తెలియాలి. 

రష్మిక కుక్క బిస్కెట్లు తింటుంది డైలీ