కేసీఆర్ ని చూసి కుళ్లుకుంటున్న బాబు

అప్పట్లో బాబు థర్డ్ ఫ్రంట్ కి అన్నీ నేనేనని చెప్పుకునేవారు, ఆ తర్వాత ఎన్డీఏ కన్వీనర్ కూడా తానేనన్నారు. కానీ జాతీయ రాజకీయాల్లో బాబుకి విశ్వసనీయత, మంచి పేరు లేవు. ఇప్పుడు కేసీఆర్ రైజింగ్…

అప్పట్లో బాబు థర్డ్ ఫ్రంట్ కి అన్నీ నేనేనని చెప్పుకునేవారు, ఆ తర్వాత ఎన్డీఏ కన్వీనర్ కూడా తానేనన్నారు. కానీ జాతీయ రాజకీయాల్లో బాబుకి విశ్వసనీయత, మంచి పేరు లేవు. ఇప్పుడు కేసీఆర్ రైజింగ్ స్టార్ అవుతున్నారు. మోదీని చెడామడా తిట్టేసి దేశ రాజకీయాల్లో ఓ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. మమత, కేజ్రీతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు.

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, కేసీఆర్ కంటే ముందే తనకి జాతీయ నాయకులు తెలుసు అని గొప్పలు చెప్పుకునే బాబు ఇప్పుడు కుళ్లుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు దూరంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే అందులో కేసీఆర్ కీలకంగా ఉంటారు, బాబుకి ఏపీలో జగన్ ని ఎదుర్కోడానికే టైమ్ సరిపోవట్లేదు.

కేసీఆర్ కి గతంలోనే ఢిల్లీ ఆలోచనలు ఉన్నాయని అంటారు కానీ, ఆయన నేరుగా ఎప్పుడూ ఈ స్థాయిలో రంగంలోకి దిగలేదు. ఇటీవల వరుసగా అన్ని రాష్ట్రాల నేతల్ని, వామపక్షాల్ని కూడా కలిశారు కేసీఆర్. మోదీపై గతంలో ఎవరూ, ఎక్కడా చేయనంత ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ కి కూడా కొమ్ముకాస్తున్నారు. థర్డ్ ఫ్రంట్ కి సొంతంగా బలం లేకపోయినా, కాంగ్రెస్ ని కూడా కలుపుకోవాలనేది ఆయన ప్లాన్. అస్సలు ఇలాంటి ప్లాన్ ని ఎవరూ ఊహించలేదు కూడా.

మేథావిని, రాజకీయ చాణక్యుడిని అని చెప్పుకునే బాబుకి కూడా ఈ ఐడియా రాలేదు. కానీ ఇప్పటికే ఆలస్యం అయింది, ఆల్రడీ కేసీఆర్ మమత, కేజ్రీ, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, లాలూ బ్రదర్స్.. వంటివారందరికీ దగ్గరయ్యారు. ఎలాగూ ఎంఐఎం చేతిలో పార్టీయే కాబట్టి కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అయితే తిరుగే ఉండదు. ఎటొచ్చీ చంద్రబాబు లాంటి వారికే ఏమీ ఉండదు. బాబుకి ఎంపీలే ఉండరు కాబట్టి, ఆయన ఉచిత సలహాలిస్తామన్నా కూడా ఎవరూ తీసుకోరు.

ప్రధాన అడ్డంకి చినబాబే..!

కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తానంటూ అంత ధైర్యంగా ఎందుకు చెబుతున్నారంటే, రాష్ట్రంలో ఆయనకి కానీ, ఆయన పార్టీకి కానీ తిరుగు లేదు. కేటీఆర్ ఆల్రడీ పార్టీపై పట్టు పెంచుకున్నారు. పట్టాభిషేకం చేసినా తడబడకుండా పాలించగలరు. అందుకే కేసీఆర్ ఢిల్లీవైపు చూస్తున్నారు. కానీ బాబుకి ఆ పరిస్థితి లేదు. టీడీపీకి ఆయనే దిక్కు, చినబాబు చేతిలో పెడితే ఆ కాస్త పరువు కూడా పోతుంది. అందుకే 2024లో జగన్ తో తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు.

ఇప్పుడు దేశ రాజకీయాల్లో వేలు పెట్టాలంటే అది నేలవిడిచి సాము చేయడమే అవుతుంది. జగన్ నే ఎదుర్కోలేనివారు, ఇక మోదీని టచ్ చేయగలరా..? తనకి రావాల్సిన అవకాశం కేసీఆర్ కి వెళ్లిపోయిందని చంద్రబాబు తెగ బాధపడిపోతున్నారు. థర్డ్ ఫ్రంట్ నేతలంతా కేసీఆర్ దగ్గరకు వెళ్తుంటే, చంద్రబాబు దీనంగా చూస్తుండిపోయారు.