సీఎం జగన్కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక సమర్పించడంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధానిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంస్థ సీఎంకు ఇచ్చిన నివేదికలను చెత్తబుట్టలో వేయాలని మండిపడ్డారు.
ఆయన విమర్శలపై ‘బాబు మాటపై తూటా’ వ్యంగ్య రచన.
మాటః ఇప్పటికైనా ప్రభుత్వం నాటకాలు ఆపాలిః బాబు
తూటాః అవున్లే నాటకాలాడితేగీడితే టీడీపీనే చేయాలి
మాటః బోస్టన్ కమిటీకి తలాతోక ఉందా?
తూటాః ఇంతకూ మీ మాటలకు తలాతోక ఉందా?
మాటః రాజధానిపై బోస్టన్ గ్రూప్ నివేదిక ఇవ్వమని అడిగే హక్కు మీకెక్కడిది?
తూటాః ఇంకా మీకే హక్కులున్నాయనుకుంటున్నారా?
మాటః ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతులు బలవుతున్నారు
తూటాః ఇంకా రెండు కంతుల రైతు రుణమాఫీ చెల్లించకపోవడం జగన్ సర్కార్ చేతగానితనమే…
మాటః రాజధాని ఎక్కడ ఉండాలో శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా చెప్పింది
తూటాః మనం వినలేదు కదా మాస్టారూ…
మాటః శివరామకృష్ణ కమిటీ నిర్ణయం మేరకే రాజధాని నిర్మాణం
తూటాః అయ్య బాబోయ్…ఎవరూ చూడని ఆ రాజధాని ఎక్కడ సార్
మాటః రాజధాని నిర్ణయించడానికి నారాయణ కమిటీ వేశామని అబద్ధాలు చెబుతున్నారు
తూటాః రాజధానిపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వేశారనేది నిజమా..
మాటః సభ్యత లేకుండా మాట్లాడటం తగదు
తూటాః అవునవును మీరు సభ్యతకే సభ్యత నేర్పగల సమర్థులు
మాటః విశాఖను గొప్ప నగరంగా అభివృద్ధి చేసింది మేమే
తూటాః అందుకే కాబోయే నూతన రాజధానికి మీ పేరు పెడితే సరి
మాటః కమిటీల పేరుతో ప్రజలకు అసత్యాలు చెబుతున్నారు
తూటాః అసత్యాలు, అబద్ధాలపై మీకు పేటెంట్ రైట్స్ ఉంటే వాళ్లెలా చెబుతారు?
మాటః సంక్రాంతి భోగి మంటల్లో జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ ప్రతులు తగలబెట్టాలి
తూటాః రాజధాని భూముల్లో పంటలను తగలబెట్టించినట్టా…