చెప్పేది శ్రీ‌రంగ‌నీతులు…చేసేది రాజ‌కీయాలా!

క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో ఎవ‌రూ రాజ‌కీయాలు చేయ‌వ‌ద్ద‌ని, తాము కూడా చేయ‌మని ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు గొప్ప ప్ర‌క‌టించ‌డాన్ని చూశాం. బాబు నుంచి వ‌చ్చిన ఆ ప్ర‌క‌ట‌న చూసి ఇది క‌లా? నిజ‌మా?…

క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో ఎవ‌రూ రాజ‌కీయాలు చేయ‌వ‌ద్ద‌ని, తాము కూడా చేయ‌మని ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు గొప్ప ప్ర‌క‌టించ‌డాన్ని చూశాం. బాబు నుంచి వ‌చ్చిన ఆ ప్ర‌క‌ట‌న చూసి ఇది క‌లా? నిజ‌మా? అని అనుకున్న వాళ్లు కూడా లేక‌పోలేదు. క‌నీసం తాను చెప్పిన మాట‌కు ఒక్క‌రోజు కూడా క‌ట్టుబ‌డి ఉండ‌లేని ప‌రిస్థితి. మాట‌పై నిల‌క‌డ లేని చంద్ర‌బాబును చూస్తే జాలేస్తోంది. ఇప్పుడు రాజ‌కీయాల‌కు వ‌చ్చిన తొంద‌రేంటో అర్థం కావ‌డం లేదు.

తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం ఆన్‌లైన్‌ ద్వారా చంద్రబాబు నిర్వహించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, నియోజకవర్గాల పార్టీ బాధ్యులతో ఆయ‌న మాట్లాడారు. పేదలను, కార్మికులను, పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కడికక్కడ ఒత్తిడి తేవాలని కోరారు.  మండల స్థాయిలో   దీక్షలు చేయాలని బాబు పిలుపునిచ్చారు.

ఒక‌వైపు ప్ర‌భుత్వం రైతుల‌ను ఆదుకునేందుకు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ విష‌యం తెలిసే చంద్ర‌బాబు ఆ క్రెడిట్‌ను త‌న ఖాతాలో వేసుకునేందుకు ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌నే విష‌యం చిన్న పిల్లోళ్ల‌కు కూడా అర్థ‌మ‌వుతోంది. ఒకే విష‌యాన్ని ప‌దేప‌దే చెబుతూ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో విషాన్ని నింపేందుకు బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీఇన్నీ కావు. స్థానిక ఎన్నిక‌ల్లో ఓట్ల క‌క్కుర్తితో అధికార నేత‌లు గుంపులుగా తిర‌గ‌డం వ‌ల్లే రాష్ట్రంలో క‌రోనా ఉధృత‌మైంద‌ని బాబు చెప్ప‌డం…ఆయ‌న‌లోని బాధ్య‌తారాహిత్యానికి నిద‌ర్శ‌నం.

క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో బాధ్య‌త గ‌ల మాజీ ముఖ్య‌మంత్రిగా, సుదీర్ఘ రాజ‌కీయ అనుభం ఉన్న నేత‌గా ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల్సింది పోయి బుర‌దజ‌ల్లే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌డం బాబుకే చెల్లింది. య‌ధారాజా త‌థాప్ర‌జ అన్న‌ట్టు…బాబును చూసి ఆయ‌న పార్టీ నేత‌లు కూడా అదే ప‌ద్ధ‌తిని అవ‌లంబిస్తున్నారు.

‘పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖల వల్ల కొన్నిమేళ్లు జరిగాయి. ఏప్రిల్‌ నెలలో 100శాతం పింఛను చెల్లించడం ద్వారా రిటైర్డ్‌ ఉద్యోగులకు మేలు చేకూరింది. వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. గుజరాత్‌ నుంచి మత్స్యకారులను ప్రత్యేక బస్సుల్లో తీసుకొస్తున్నారు’ అని ప్ర‌భుత్వం మంచిచేస్తే మాత్రం…ఆ గొప్ప‌ద‌నం అంతా త‌మ‌దే అని చెప్పుకోవ‌డం టీడీపీకే చెల్లింది.  

ఐదేళ్ల పాల‌న‌లో సామాన్యుల‌కు ఒక్క‌టంటే ఒక్క మంచి ప‌ని కూడా చేయ‌ని టీడీపీ ప్ర‌భుత్వం…ఇప్పుడు అధికారం కోల్పోయ‌న త‌ర్వాతైనా త‌మ త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవాల్సింది పోయి…మ‌ళ్లీ అవే త‌ప్పులు కొన‌సాగిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఒక వైపు రాజ‌కీయాల గురించి శ్రీ‌రంగ నీతులు చెబుతూ…మ‌రోవైపు ప్ర‌జ‌లు అస‌హ్యించుకునే రాజ‌కీయాలు చేయ‌డం వ‌ల్ల టీడీపీ ఏం సాధించాల‌నుకుంటోందో మ‌రి.

హెరిటేజ్ లో ఎంతమందికి కరోనా వచ్చింది?