అమరావతిని వదిలేశారు.. ఇక టిడ్కోలో నిప్పులు

ఆక్రమించండి, ఆక్రమించుకోండి. మీ వెంట మేమున్నామంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడ్కో ఇళ్లతో పాటు, ఇటీవల కేటాయింపులకి సిద్ధమైన ఇళ్ల స్థలాలని కూడా లబ్ధిదారులంతా సంక్రాంతినాటికి ఆక్రమించుకోవాలని వారికి టీడీపీ…

ఆక్రమించండి, ఆక్రమించుకోండి. మీ వెంట మేమున్నామంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడ్కో ఇళ్లతో పాటు, ఇటీవల కేటాయింపులకి సిద్ధమైన ఇళ్ల స్థలాలని కూడా లబ్ధిదారులంతా సంక్రాంతినాటికి ఆక్రమించుకోవాలని వారికి టీడీపీ నేతలు అండగా ఉంటారని ఊదరగొడుతున్నారు.

సడన్ గా చంద్రబాబుకి టిడ్కో ఇళ్లు ఎందుకు గుర్తొచ్చాయి? సంక్రాంతి డెడ్ లైన్ పెట్టి మరీ బాబు రెచ్చిపోవడం వెనక అసలు కారణం ఏంటి? అమరావతి అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టడానికే బాబు ఈ కొత్త ఎత్తుగడ వేసినట్టు అర్థమవుతోంది.

అమరావతి పూర్తిగా ప్రాంతీయ సమస్యగా మారిన దశలో.. అమరావతిలోనే, అమరావతికి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలైన నేపథ్యంలో, ఇతర ప్రాంతాల్లో అమరావతికి వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబుకుతాయన్న సమాచారంతో బాబు కాడె పడేశారు. అలాగని ఏదో ఒక సమస్యపై జనాల్లోకి వెళ్లకపోతే అది ప్రతిపక్షాలకు ఆత్మహత్యా సదృశమే అవుతుంది. అందుకే.. టిడ్కో ఇళ్ల వ్యవహారాన్ని తలకెత్తుకున్నారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ అపార్ట్  మెంట్లు కట్టించారు. అంటే ఇది రాష్ట్రవ్యాప్త సమస్య, కారణం ఏదైనా, తప్పు చేసింది ఎవరైనా ప్రస్తుతానికి లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. బ్యాంకులకు డిపాజిట్లు చెల్లించి, కళ్లెదుట సగం పూర్తయిన నిర్మాణాలు కనిపిస్తున్నా.. అందులో చేరేదెన్నడో తెలియక ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి వారందర్నీ రెచ్చగొట్టడమే ఇప్పుడు బాబు పని.

దీనికి తోడు.. వైసీపీ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన ఇళ్ల స్థలాల విషయంలో కూడా బాబు రాజకీయం చేయడం మరీ విడ్డూరం. కోర్టు కేసులతో ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకున్న బాబు.. అవే పట్టాల కోసం ప్రజల్ని ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసం. 

కోర్టు కేసులు ఉన్నంతవరకు పంపిణీ ఆపేసి, మిగతా చోట్ల పట్టాలు ఇవ్వొచ్చు కదా అనే ఉచిత సలహా పారేస్తున్న చంద్రబాబుకి… ఆ కేసుల్ని విరమించుకునే సదుద్దేశం ఎందుకు లేదు?

కేవలం ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు బాబు. అమరావతి పూర్తిగా తన మెడకే చుట్టుకుని, తనని ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేస్తున్న దశలో.. దాని నుంచి బైటపడేందుకే టిడ్కో అపార్ట్ మెంట్ల వ్యవహారాన్ని హైలెట్ చేస్తున్నారు.

300 గజాల లోపు ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి, బ్యాంకులకు కట్టాల్సిన బాకీ కూడా ప్రభుత్వమే కట్టి వాటిని ప్రజలకు ఉచితంగా ఇచ్చేందుకు జగన్ సన్నాహాలు చేస్తున్న దశలో ముందుగానే బాబు ఈ డ్రామాకు తెరతీశారు. సంక్రాంతి ఆక్రమణ అంటూ రంకెలేస్తున్నారు.

కమిష‌న్ల క‌క్కుర్తిలో ములిగిపోయిన పోలవరం