పాలనలో పదే పదే అడ్డంకులు సృష్టిస్తున్న చంద్రబాబుపై జగన్ పైచేయి సాధించారు. కేంద్రానికి బాబు ఎన్ని ఫిర్యాదులు చేసినా అక్కడ జగన్ పరపతికి వచ్చిన ఢోకా ఏమీ లేదని మరోసారి రుజువైంది. ఈ వ్యవహారంతో చంద్రబాబు నీఛ రాజకీయం మరోసారి బైటపడింది. ఆయన పైశాచికానందం ఏ స్థాయిలో ఉందో ప్రజలకు అర్థమైంది.
ఉపాధి హామీ పనిదినాలు రాష్ట్రానికి మంజూరు చేయడానికి వీల్లేదంటూ మోకాలడ్డాలని చూశారు చంద్రబాబు. కానీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం మన్నించడంతో అదనంగా 4.25 కోట్ల పనిదినాలకు ఆమోదం లభించింది. ఈమేరకు రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలు లాభం పొందబోతున్నారు.
వివరాలు ఇవీ..
ఏపీకి ఈ ఏడాది 21కోట్ల పనిదినాలు కేంద్రం కేటాయించింది. లాక్ డౌన్ సమయంలో పేదలకు ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో.. ఐదు నెలలుగా వీటిని భారీగా వాడుకుంది. లాక్ డౌన్ తో పనులు లేని వ్యవసాయ కూలీలకు, పేదలకు ఉపాధి హామీ నిధులే ఆర్థిక ఆసరాగా నిలిచాయి. దీంతో 20.15కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి, మిగిలిన 85లక్షలు మరో పక్షం రోజుల్లో పూర్తవుతాయి.
ఈ నేపథ్యంలో అదనంగా పనిదినాలు కేటాయించాలని ఏపీ కేంద్రాన్ని కోరింది. అయితే ఇక్కడే చంద్రబాబు తన నక్కజిత్తులు చూపించారు. తన రాజకీయ స్వార్థానికి ప్రజల్ని, నిరుపేదల్ని బలిచేయాలని చూశారు.
టీడీపీ చెత్త లాజిక్
రాష్ట్రానికి అదనంగా పనిదినాలు కేటాయించొద్దని టీడీపీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యాదులు చేసింది. 2019లో చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని, పాత బిల్లులు చెల్లించాకే కొత్తవాటిని మంజూరు చేయాలని కోరుతూ చెత్త లాజిక్ బయటకు తీసింది.
వాస్తవం ఇదీ..
ఉపాధి పనుల్లో యంత్రాలు వినియోగించకూడదనే నిబంధన ఉంది. కానీ 2019 ఎన్నికల సమయంలో టీడీపీ కాంట్రాక్టర్లు భారీగా యంత్రాలతో పనులు పూర్తి చేసి ఉపాధి హామీ డబ్బు కాజేయాలని చూశారు. నామినేషన్ పద్ధతిలో 2,200 కోట్ల రూపాయల పనుల్ని టీడీపీ నేతలకు కేటాయించారు. వైసీపీ వచ్చాక వీటిపై విచారణ మొదలు పెట్టింది.
నామినేషన్ పద్ధతిలో ఇచ్చిన పనుల్ని ఎక్కడ చేశారు, ఎలా చేశారు అన్నదానిపై క్షేత్రస్థాయి విచారణ జరిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బిల్లులు ఆగాయి. దీన్ని అడ్డం పెట్టుకుని కొత్త పనిదినాలు ఏపీకి వద్దంటూ సాక్షాత్తూ ఇక్కడి ప్రతిపక్షమే ఫిర్యాదు చేయడం దారుణం.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఈ ఫిర్యాదులతో విస్తుపోయింది. రాష్ట్రానికి నిధులు వస్తాయంటే అడ్డుపడే ప్రతిపక్షాన్ని ఏపీలోనే చూస్తున్నామని కొంతమంది అధికారులు వ్యాఖ్యానించడం టీడీపీ దుర్మార్గానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. కానీ అంతిమంగా టీడీపీ దుష్ట రాజకీయాలపై జగన్ సర్కారు విజయం సాధించింది.
కొత్తగా 4.25 కోట్ల పనిదినాలను ఏపీకి కేటాయించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అవసరమైతే ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరులో మరోసారి అదనపు పనిదినాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.