ఫ్లాష్ బ్యాక్ లో అన్నీ బాగుండవు, కొన్ని మాత్రమే తీపి గుర్తులుంటాయి. ఇక రాజకీయ నాయకుల డైరీలో వెనక పేజీలు చూసుకోవడానికి కూడా జడుసుకుంటారు. కానీ కెలికేందుకు, ఆ పేజీలను తిప్పేందుకు ఎవరైనా ఉన్నపుడే వస్తుంది అసలైన తంటా.
చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు చేసే ఆర్భాటాలు అన్నీ అందరికీ తెలిసినవే. అయితే ప్రత్యర్ధి పార్టీలు విమర్శిస్తే అది రెగ్యులర్ తిట్ల పురాణంగా ఉంటుంది. ఆయన పక్కనే ఉన్న తమ్ముడు చెబితేనే అందులో పొలిలిటికల్ మాసాలా చాలా యాడ్ అవుతుంది.
విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చంద్రబాబు హామీలు, మాటల మూటల గురించి ఫ్లాష్ బ్యాక్ కధ ఒకటి చెప్పారు. ప్రతీ మత్య్సకార దినోత్సవం వేళ కేక్ కట్ చేసి చంద్రబాబు చేతులు దులుపుకునేవారని గతం గురించి చెప్పి గట్టిగానే తగులుకున్నారు.
అయిదు కిలోమీటర్లకు ఒక జెట్టీ కడతానని, మత్య్సకారులను పెన్షన్లు ఇస్తానని ఇలా చాలా చెప్పిన బాబు వాటిని గురించి అడిగితే మాత్రం గట్టిగా కేకలేసేవారని వాసుపల్లి బాబు వైఖరిని చెప్పి మరీ మండిపడ్డారు. తన పాలన అయిదేళ్ళలో నోట్లో బూరెలు వండీ ఏదీ చేయక మత్య్సకారులకు బాబు మోసం చేశారని వాసుపల్లి ఫైర్ అయ్యారు.
జగన్ పదిహేడు నెలల పాలనలోనే నాలుగు ఫిషింగ్ హార్బర్లను నిర్మించతలపెట్టడం గొప్ప విషయమని కొనియాడారు. మత్యకారులకు అసలైన స్వర్ణ యుగం జగన్ తెచ్చాడని కూడా కితాబు ఇచ్చారు. మొత్తానికి తమ్ముడు ఫ్లాష్ బ్యాక్ స్టోరీతో టీడీపీకి మైండ్ బ్లాంక్ అయ్యేలాగే ఉందిట.