ఏం పీకుతారు అంటూ విశాఖ వీధుల్లో తిరుగుతూ వైసీపీ సర్కార్ పెద్దలను పదే పదే నిలదీస్తూ చంద్రబాబు సవాల్ చేశారు. రెండేళ్ల పాలనలో ఏం పీకలేకపోయారు అంటూ తెగ వెటకారమాడారు. బాబు ఒక విధంగా కోరి మరీ కొరివితో తలగోక్కున్నారా అన్న డౌట్లు ఇపుడు వస్తున్నాయి.
దానికి ధీటు అయిన జవాబే వైసీపీ నుంచి వచ్చింది. చంద్రబాబు ఎందుకు తొందర, విదేశాలో నీవు దాచుకున్న అయిదు లక్షల కోట్ల రూపాయల అక్రమ సొమ్మును పీకి మరీ ఏపీకి తెస్తాం. నీ అవినీతి భాగోతాలను ఒక్కోటిగా పీకుతాం. అంటూ విజయసాయిరెడ్డి విశాఖ నడిబొడ్డునే బిగ్ సౌండ్ చేశారు.
ఏపీలో వైసీపీ ఏం పీకింది అన్న చంద్రబాబుకు గుర్తు ఉందో లేదో కానీ రెండేళ్ల క్రితం అధికారం నుంచి పీకి పక్కన పెట్టాం, లేటెస్ట్ గా కుప్పంలో కూడా టీడీపీ జెండా పీకేసి జనాలు బాబుకు బుద్ధి చెప్పినా కూడా ఆయనలొ అహంకారం ఇంకా తగ్గలేదు అంటూ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.
అయిదేళ్ల పాటు అక్రమంగా కరకట్ట మీద కట్టిన ఇంట్లో కూర్చుని ఆర్జించిన అక్రమ సంపాదనను పీకే పని మొదలైంది. చూస్తూ ఉండూ బాబూ నీ చేత అవినీతి సొమ్ము టోటల్ గా కక్కిస్తామని, ఏం పీకాలో అన్నీ పీకుతామంటూ గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు విజయసాయిరెడ్ది.