భావనపాడుకు మోక్షం…సిక్కోలు కల తీర్చిన జగన్

శ్రీకాకుళం జిల్లాకు పోర్ట్ కావాలన్నది చిరకాల డిమాండ్. భావనపాడు పోర్ట్ కోసం వారు ఉద్యమాలే చేశారు. ఉత్తరాంధ్రాలోని   మూడు జిల్లాల్లో  చూసుకుంటే మత్స్య‌కారులు పెద్ద సంఖ్యలో శ్రీకాకుళంలోనే  ఉంటారు. వీరంతా ఉపాధి కోసం చెన్నై,…

శ్రీకాకుళం జిల్లాకు పోర్ట్ కావాలన్నది చిరకాల డిమాండ్. భావనపాడు పోర్ట్ కోసం వారు ఉద్యమాలే చేశారు. ఉత్తరాంధ్రాలోని   మూడు జిల్లాల్లో  చూసుకుంటే మత్స్య‌కారులు పెద్ద సంఖ్యలో శ్రీకాకుళంలోనే  ఉంటారు. వీరంతా ఉపాధి కోసం చెన్నై, గుజరాత్ దాకా వలస వెళ్ళిపోతారు.

వారికి జగన్  తన పాదయాత్ర వేళ హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే భావనపాడు పోర్టుని నిర్మాణం చేస్తామని ఆనాడే ప్రకటించారు. జగన్ అధికారంలోకి వచ్చి 15 నెలలు కూడా కాకుండానే ఈ పోర్ట్ నిర్మాణానికి రంగం సిధ్ధం చేశారు. దీనికి సంబంధించిన డీపీయార్ కి జగన్ సర్కార్ ఆమోదముద్ర వేసింది.

తొలి దశ కింద మూడేళ్ళలో ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడానికి కూడా రంగం సిధ్ధం చేస్తోంది. ఇక భూసేకరణ కోసం పెద్ద ఎత్తున  నిధులను మంజూరు చేస్తోంది. ఇవన్నీ చూసుకున్నపుడు జగన్ అధికారంలో ఉండగానే ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది అని కచ్చితంగా చెప్పాల్సిందే. మొత్తానికి జగన్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి భావన‌పాడు పోర్టుకి మోక్షం కల్పించారు.  అత్యంత వెనకబడిన శ్రీకాకుళం అభివ్రుధ్ధికి బాటలు వేశారు.

పవన్ కళ్యాణ్ నా గర్ల్ ఫ్రెండుని

టీడీపీ కాంగ్రెస్ దొందూ దొందే