అందరు ముఖ్యమంత్రుల మాదిరిగా జగన్ లేరు. ఆయన తన పాలనలో ప్రత్యేకతను సాధించుకున్నారు. తనదైన ముద్ర వేసుకున్నారు. ఎక్కడ ఏ పధకం ప్రారంభించినా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దాని వెనక లోతైన ఆలొచన, విశ్లేషణ జగన్ కి ఉన్నాయని మేధావులు సైతం అంగీకరిస్తారు.
ఇదిలా ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే విశాఖకు కొత్త వెలుగు వచ్చిందని అంతా చెబుతారు. అప్పటిదాకా విశాఖను కేవలం అవసరాలకు వాడుకోవడమే తప్ప అసలైన అధికారిక హోదా ఇచ్చిన సందర్భం ఏ సర్కార్ లోనూ లేదు.
కానీ జగన్ మాత్రం ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల వ్యవధిలోనే విశాఖను పాలనా రాజధాని చేశారు. ఇక గత ఏడాది దీనికి చట్టపరమైన ఆమోదముద్ర కూడా వేశారు. ప్రస్తుతం ఇది న్యాయ స్థానంలో విచారణ దశలో ఉంది. ఇవాళ కాకపోయినా రేపు అయినా విశాఖే ఆంధ్రాకు అసలైనా రాజధాని అవుతుందని వైసీపీ నాయకులు అంటున్నారు.
జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్రా జిల్లాలను అభివృద్ధి పధంలో నడిపించేందుకే జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించారని వైసీపీ నాయకుడు వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు.
జగన్ దూర దృష్టికి ఇదే నిదర్శనమని, అన్ని వర్గాలు, ప్రాంతాలు ప్రగతిపధంలో నడవాలన్నదే జగన్ అజెండా అని ఆయన కొనియాడారు. విశాఖ రాజధానిగా ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది అని ఆయన ధీమాగా చెబుతున్నారు.