జగన్ విషయంలో విపక్షాలు ఎపుడూ మెచ్చుకోవు. ఆయన చేసిన ప్రతీ మంచి పనిలో కూడా చెడ్డను చూడాలనుకుంటాయి. అది ఫక్త్ పాలిటిక్స్ అన్నది కూడా జనాలకు తెలుసు. ఇదిలా ఉంటే దేశంలోనే ఏపీ కరోనా కట్టడిలో నంబర్ వన్ గా ఉందని ఏ రాజకీయం ఎరగని వారు చెప్పేమాట. అలాగే వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తూ వైసీపీ సర్కార్ ముందుకు సాగుతోంది.
దీని మీద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్ని ప్రశంసలతో ముంచెత్తారు. దేశానికే జగన్ పాలన ఆదర్శమని కూడా ఆయన కొనియాడారు. విశాఖలో వేయి పడకల కోవిడ్ సెంటర్ ని ప్రారంభించిన ఆయన జగన్ ని లక్ష్యమున్న ముఖ్యమంత్రి అని మెచ్చుకున్నారు.
కరోనా మొదటి రెండవ దశలను జగన్ సమర్ధంగా ఎదుర్కొన్న తీరు ఇతర రాష్ట్రాలకు స్పూర్తిదాయకమని కూడా ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఏపీలో వైద్య సదుపాయాలు భేష్ అయిన తీరులో ఉన్నాయని, దీని వెనక ముఖ్యమంత్రి జగన్ విజన్ ఉందని కూడా అన్నారు.
జగన్ వంటి నాయకులు ఉంటే దేశంలో కరోనాను పూర్తి స్థాయిలో తిప్పుకొట్టగలమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తానికి రెండేళ్ల పాలన పూర్తి చేసుకుని మూడవ ఏట ప్రవేశిస్తున్న జగన్ కి కేంద్ర మంత్రి ప్రశంసలు ఈ స్థాయిలో దక్కడం అంటే ఒక రకమైన ప్రోత్సాహకమే అని భావించాలి.