రాజధాని అమరావతి విషయంలో బీజేపీ చేతులెత్తేసింది. 'రాజకీయ పోరాటం మాత్రమే చేస్తాం.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జోక్యం చేసుకోదు..' అని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ఇంకోసారి కుండబద్దలుగొట్టేశారు. అంతే కాదు, ఒకవేళ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి రాజధానుల్ని నోటిఫై చేసేలా జీవో జారీ చేస్తే, కేంద్రం గుర్తించి తీరుతుంది..' అని కూడా స్పష్టం చేసేశారు.
సో, ఇక్కడ విషయం సుస్పష్టం. ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ సర్కార్‌కి అడ్డంకులు దాదాపుగా లేనట్లే. ఆ మాటకొస్తే, మొదటి నుంచీ భారతీయ జనతా పార్టీకి చెందిన జాతీయ స్థాయి నేతలు ఇదే చెబుతున్నారు. అయినా, బీజేపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జతకట్టారు. 'షరతుల్లేకుండా బీజేపీకి పవన్ మద్దతిస్తున్నారు' అని అప్పట్లో బీజేపీ నేతలు చెప్పడమే కాదు, పవన్ కూడా అదే మాట చెప్పారు.
అయినాగానీ, 'అమరావతి మారదు.. ఈ విషయంలో కేంద్రం నాకు హామీ ఇచ్చింది..' అని పవన్ చెబుతూ వచ్చిన విషయం విదితమే. అదంతా ఉత్తదేనని ఇంకోసారి తేలిపోయిందిప్పుడు. మరి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేయగలరు.? బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం పవన్ కళ్యాణ్‌కి పెద్ద కష్టమేమీ కాదు. కానీ, తెగతెంపులు చేసుకుని సాధించేదేంటి.? పోనీ, బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తే.. ప్రజలకు.. మరీ ముఖ్యంగా అమరావతి రైతులకి ఆయన ఏం సమాధానం చెప్పగలరు.!
పవన్ సంగతి పక్కన పెడితే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ పరిస్థితి కూడా దారుణంగా తయారైందిప్పుడు. 'కేంద్రం జోక్యం చేసుకోకపోతే, ఏపీ బీజేపీ శ్రేణులు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షంపై రాజధాని విషయమై ఎంత పోరాటం చేసినా ఏం లాభం.?' అన్న చర్చ ఏపీ బీజేపీ శ్రేణుల్లో జరుగుతోంది.
'కేంద్రంతో మాకు డైరెక్ట్ లింక్స్ వున్నాయి.. అవి కేంద్రం – రాష్ట్రానికి మధ్య వుండాల్సిన సన్నిహిత సంబంధాలే..' అని వైసీపీ అధికార ప్రతినిథి రవిచంద్రారెడ్డి పదే పదే చెబుతున్నారు. అదే నిజమయ్యిందిప్పుడు.
గూగుల్లో ఎంత సెర్చ్ చేసినా ఒక్క అమ్మాయితో కూడా లింకప్ రావట్లేదు