అక్కడ బీజేపీ సర్జికల్ స్ట్రైక్ ?

బీజేపీకి ఆరాటం ఎక్కువైపోతోంది. గమ్యం చేరుకోవాలని ఆత్రం కూడా అధికం అవుతోంది. నిజానికి రాజకీయ పార్టీలకు దూకుడు ఉండాల్సిందే. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు  తరువాత ఏపీ బీజేపీ కూడా గ్రేర్ మార్చేసింది. Advertisement…

బీజేపీకి ఆరాటం ఎక్కువైపోతోంది. గమ్యం చేరుకోవాలని ఆత్రం కూడా అధికం అవుతోంది. నిజానికి రాజకీయ పార్టీలకు దూకుడు ఉండాల్సిందే. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు  తరువాత ఏపీ బీజేపీ కూడా గ్రేర్ మార్చేసింది.

తమకు అడ్డంకి అనుకున్న ప్రధాన ప్రతిపక్షాన్ని ముందు నిర్వీర్యం చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రా జిల్లాలను టార్గెట్ చేసింది. ఇక్కడకు పలు మార్లు టూర్లు వేసిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు టీడీపీలోని అసంతృప్తులకు గేలం వేశారని అంటున్నారు.

దాంతో విజయనగరం జిల్లాలో కొన్ని పెద్ద తలకాయలు బీజేపీ వైపు చూస్తే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీ కుటుంబంగా ఉన్న దివంగత‌ ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడు  కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడుని బీజేపీలోకి తీసుకురావాలనుకుంటున్నారుట.

అదే విధంగా మాజీ మంత్రి పడాల అరుణ కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని భోగట్టా. ఇక చీపురుపల్లిలో ఒక బలమైన రాజు గారు, టీడీపీకి చెందిన సీనియర్ నేత కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని అంటున్నారు. 

మొత్తానికి ఉత్తరాంధ్రా టీడీపీ పైన బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేస్తోందని అంటున్నారు.  దాంతో చాలా మంది టీడీపీ తమ్ముళ్ళు కాషాయం కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ రాజకీయ తమాషా ఎలా ఉంటుందో.

బాబుని వేటాడుతున్న భయం