పవన్ కు కానరాని మద్దతు

ఒక్కోసారి అంతే..అలాగే జరుగుతూ వుంటుంది. లెఫ్టిస్ట్ భావాలున్న ప్రకాష్ రాజు భారతీయ జనతాపార్టీ మీద విరుచుకుపడడంలో వింత లేదు. అయితే అది కాస్తా మరికాస్త ముందుకు వెళ్లి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ను…

ఒక్కోసారి అంతే..అలాగే జరుగుతూ వుంటుంది. లెఫ్టిస్ట్ భావాలున్న ప్రకాష్ రాజు భారతీయ జనతాపార్టీ మీద విరుచుకుపడడంలో వింత లేదు. అయితే అది కాస్తా మరికాస్త ముందుకు వెళ్లి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ను గట్టిగా టార్గెట్ చేసేంత వరకు వెళ్లింది. కాస్త ఘాటు పదజాలమే వాడేసారు కూడా.

ఇది పవన్ కళ్యాణ్ కు కాస్త గట్టిగా తగిలిందని బోగట్టా. సినిమా జనాలు తనను డిఫెండ్ చేయాలి కదా? అని ఆయన తన సన్నిహితుల దగ్గర బాధపడినట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా తనతో సినిమా చేస్తున్న నిర్మాతలు ఎవ్వరూ తనకు మద్దతుగా ఏదో ఒకటి ట్వీట్ చేయవచ్చు కదా? అని ఆయన ఫీలయినట్లు తెలుస్తోంది. 

ఒక్క నాగబాబు మినహా మరొకరు ట్వీట్ లు వేయలేదు. ఆయన కూడా పోలిటికల్ విమర్శ బదులుగా సినిమాటిక్ విమర్శ చేసారు. నిర్మాతలు ఎవ్వరూ అలా చేయలేకపోయారు. 

పవన్ తో సినిమా చేస్తున్న దిల్ రాజు కూడా మాట్లాడలేదు. పైగా ఆయన ప్రకాష్ రాజ్ కు అత్యంత సన్నిహితుడు. వారిద్దరి మధ్య విడదలీయలేనంత సాన్నిహిత్యం వుంది. 

ఇప్పటి వరకు పొలిటికల్ జనాలు తప్ప, సరైన సినిమా జనాలు ఎవ్వరూ పవన్ ను ఇంత గట్టిగా విమర్శించలేదు. అసలే హైదరాబాద్ ఎన్నికల విషయంలో పవన్ ను చాలా తెలివిగా కార్నర్ చేసి పక్కకు తప్పించారు. 

తిరుపతి ఎన్నిక విషయంలో  ఇలాగే జరిగేలా వుంది పరిస్ధితి. ఢిల్లీ వరకు వెళ్లి పడిగాపులు పడి, ఆఖరికి భాజపా అధ్యక్షుడిని కలిసి వచ్చా అనిపించుకున్నారు. అంతకన్నా సాధించింది ఏమీ లేదు. 

ఇలాంటి నేపథ్యంలో ప్రకాష్ రాజు గట్టిగా మాటల తూటాలు విసిరారు. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే ఏమీ అనలేని పరిస్థితి. మరోపక్క హైదరాబాద్ లో ప్రచారం చేయలని పరిస్థితి. 

ఇక అలాంటప్పుడు భాజపాకు మద్దతు ఇచ్చి ఫలితం ఏమిటి? అన్ని విధాలా రాజకీయంగా పవన్ అన్ ఫిట్ అయిపోతున్నారు. ఇలాంటపుడు కనీసం ఇండస్ట్రీ వారు అయినా కాస్త మద్దతు ఇస్తే అది బలంగా వుంటుంది. కానీ కేసిఆర్ కు పవన్ వ్యతిరేకంగా వుండడంతో ఎవ్వరూ పెదవి విప్పడం లేదు. 

బాబుని వేటాడుతున్న భయం