‘రాజు యాదవ్’ సాహ‌సం

నిచ్చన మెట్ల సమాజంలో స్థాయిని చెప్పుకోవడానికి కులాన్ని ఎక్కువగా వాడుకునే పరిస్థితి నేటి కాలనిది. నేను ఫలానా అని చెప్పాలంటే చేసే పనిని కాకుండా, కులం పేరును అర్హతగా వాడుకుంటున్న నేటి తరుణం లో…

నిచ్చన మెట్ల సమాజంలో స్థాయిని చెప్పుకోవడానికి కులాన్ని ఎక్కువగా వాడుకునే పరిస్థితి నేటి కాలనిది. నేను ఫలానా అని చెప్పాలంటే చేసే పనిని కాకుండా, కులం పేరును అర్హతగా వాడుకుంటున్న నేటి తరుణం లో అందులో పక్క వ్యాపారాత్మకంగా మారిన సినిమా పరిశ్రమలో కొన్నిటిని చెప్పడం ఒక సాహసమే. 

కులం పుట్టుక ఎలా జరిగిందనే విషయం పక్కన పెడితే, అసమానతలను ఎత్తిచూపుతూ ప్రశ్నించేందుకు చేసిన ఏ ప్రయత్నమైనా మెచ్చుకోదగినదే. మనిషి మారుతున్నాడు కానీ బహుళజాతి, నిమ్నజాతి మనుషుల పేర్లతో ప్రచారం చేయాలంటే కొంత తడబాటుకు గురౌతున్నాడు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు అ చర్చ కూడా అవసరమైన  అనవసరం.

తెలుగు లో గొప్ప సినిమాలుగా వచ్చిన పేర్లు వాటి బ్యాక్ గ్రౌండ్ ఏవిధంగా ఉంటుందో మనం చూసాం, అప్పుడెప్పుడో మాల పిల్ల, ఇంకోటి వచ్చాయి తప్ప చాలా కాలంగా మళ్ళీ ఇలాంటి పేర్లు తో రాలేదని చరిత్ర చూస్తే తెలుస్తుంది. మిగత భాషలో (తమిళం, మలయాళం etc) లో కుల వివక్ష తో చాలా సినిమాలు వస్తున్న పేరు మాత్రం వినూత్నంగా ఉంటుంది తప్ప (కాల, పెరుయర్ పెరుమాళ్) మధ్యతరగతి వాళ్ళ కులం పేరుతో సినిమా టైటిల్ పెట్టి సినిమా రాలేదని చెప్పచ్చు. 

సామాన్యుడి గోసను చూపించే గొప్ప ప్రయత్నంలో భాగంగా 'రాజుయాదవ్' సినిమాని ఏకంగా టైటిల్ గానే ప్రకటించి మన ముందుకొస్తున్నాడు నూతన దర్శకుడు కృష్ణమాచారి. వ్యాపారాత్మకంగా మారిన సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడూ కళాత్మక చిత్రాలు కనువిందు చేస్తూ మనల్ని ఆలోచింపజేస్తాయి.

బలమైన కథ, కథాంశంతో బహుళజాతి మనిషి బాధలను, అతడి బలాలను కూడా పూర్తి స్థాయి పరిణతితో జనానికి చూపించే ఈ అద్భుత ప్రయత్నాన్ని ఆదరించాలి. వీరత్వం కన్నా ఉద్యమం ఉన్నతమైనది. అందుకే రాజు యాదవ్ కేవలం ఆక్రోశాన్ని మాత్రమే ప్రదర్శించకుండా సాధారణ భావోద్వేగాలను కూడా గుండెకు హత్తుకునేలా చూపెట్టబోతున్నాడు అని వినికిడి.

సూడో రియాలిజం (అవాస్తవమైన వాస్తవికత) జానర్ లో బుల్లి తెర కమలహాసన్ గా పేరున్న గెటప్ శ్రీను హీరో గా 'రాజు యాదవ్' సినిమా వ‌స్తోంది.