ఉత్తరాంధ్రా మీద టీడీపీకి అంత నమ్మకం. నిజమే ఆ నమ్మకానికి కారణం దశాబ్దాలుగా జనాలు ఇచ్చిన భారీ విజయాలు ఉన్నాయి. అలాంటి ఉత్తరాంధ్రాలో ఫస్ట్ టైం టీడీపీ కూశాలు కదలిపోయాయి. దాంతో 2019 ఎన్నికల్లో కేవలం అరడజన్ సీట్లకే ఆ పార్టీ పరిమితం అయింది.
ఇదిలా ఉంటే టోటల్ గా 34 అసెంబ్లీ సీట్లు ఉంటే వాటిని టోకుగా తామే గెలిచేస్తామని టీడీపీ సీనియర్ నేత ఆ పార్టీ ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జి బుద్ధా వెంకన్న అంటున్నారు. ఉత్తరాంధ్రాలో ఈసారి ఎగిరేది పసుపు జెండాయే అని జబ్బలు చరుస్తున్నారు.
అంతే కాదు వైసీపీ అడ్రస్ గల్లంతు చేస్తామని కూడా చెబుతున్నారు. విశాఖను అభివృద్ధి చేసింది తామే అని ఘనంగా చెప్పుకుంటున్న బుద్ధ వెంకన్న విశాఖ రాజధాని విషయం మాత్రం ఎక్కడా మాట్లాడడంలేదు.
విశాఖలో గత టీడీపీ హయాంలో భూ కబ్జాలు పెద్ద ఎత్తున జరిగిన సంగతిని వైసీపీ నేతలు ప్రస్థావిస్తున్నారు. విశాఖను రాజధాని కాకుండా అడ్డుకున్న వైనాన్ని జనాలకు వివరిస్తే ఎన్ని సీట్లు వస్తాయో అపుడు చెప్పాలని అంటున్నారు.
ఇక బుద్ధా వెంకన్న విశాఖ జనాలు కొత్త టాక్స్ ని కడుతున్నారని కనిపెట్టి చెప్పారు దాని పేరు వీజే టాక్స్ ట. అంటే విజయసాయిరెడ్డి టాక్స్ అన్న మాట. విశాఖను తుఫాను కంటే దారుణంగా వైసీపీ విద్వంసం చేసిదని, దాన్ని తిరిగి నిర్మించే బాధ్యత తమదేనని ఆయన అంటున్నారు.
మరి వీజే టాక్స్ ఏంటో, తుఫాన్ విద్వంసాలు ఏంటో తమ్ముళ్లకే తెలియాలి. ఏది ఏమైనా వెంకన్న జోస్యం తమ్ముళ్లకు ఎంత మేరకు బూస్టప్ ఇస్తుందో చూడాలి.