మరి పౌరుషం అంటే అదే కదా. వాళ్ళు మామూలు వాళ్ళా. ఉక్కు వాడిని వేడిని నిండా నింపుకున్న వాళ్ళు. అలాంటి చోటకు వెళ్ళి చూసి వస్తానంటే ఎవరైకైనా అసలు కుదరదు కాక కుదరదు అంటున్నారు. అందుకే నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కారుని కూడా అడ్డుకుని నినాదాలు చేశారు.
నీతి అయోగ్ అన్నది మోడీ మానస పుత్రిక అంటోంది కార్మిక లోకం. ప్రణాళికా సంఘాన్ని మార్చేసి నీతి అయోగ్ ని ఏర్పాటు చేశారని, దీని ద్వారా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పోరేట్ శక్తులకు ధారపోయడమే పనిగా పెట్టుకున్నారని కూడా ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు విమర్శిస్తున్నారు.
తమలో ఉక్కు కోసం అమరులైన 32 మంది కార్మికుల పౌరుషం, స్పూర్తి అలాగే ఉన్నాయని, అందుకే కేంద్రం నుంచి ఏ పెద్ద వచ్చినా తాము ఉక్కు లోపలికి కాదు కదా గేటు కూడా తాకనివ్వమని గట్టి శపధమే చేస్తున్నారు. మొత్తానికి నీతి అయోగ్ పెద్దకు ఒక విషయం అర్ధమై ఉండాలి.
విశాఖ ఉక్కు ప్రైవేట్ అంటే జనం పెద్ద ఎత్తున గర్జిస్తారని, ఆ మాటను ఆయన కేంద్ర పెద్దల చెవిన వేసినా వేయవచ్చు. కానీ వారు అక్కడితో ఆగుతారా. ఆలోచిస్తారా…వెయిట్ అండ్ సీ.