చంద్రబాబును దేశంలోనే అత్యంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ గా అభివర్ణించారు గతంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్. చంద్రబాబువి పరమ నీఛ రాజకీయాలు అని ఆయనతో కొన్నేళ్ల పాటు అంటకాగిన కేసీఆర్ ఇచ్చి కితాబు అది.
కేసీఆర్ అన్నాడనే కాదు.. చంద్రబాబు థర్డ్ గ్రేడ్, వరెస్ట్ పాలిటిక్స్ సామాన్యులకు కూడా అర్థం అవుతూ ఉండటం దశాబ్దాల నుంచి జరుగుతున్నదే. బహుశా తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ అభిమానులు, కమ్మ సామాజికవర్గం వారు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్ప.. చంద్రబాబు రాజకీయంలోని నైచ్యాన్ని ఎండగట్టిన వారు ఎంతో మంది ఉంటారు.
ఆ సంగతలా ఉంటే.. ఏపీ సీఎం జగన్, సినిమా హీరోల సమావేశం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన నైజాన్ని మరోసారి చాటుతున్నాయి. సినిమా టికెట్ రేట్ల గురించి జగన్ ను మెగాస్టార్ చిరంజీవి బతిమాలుకోవాలా.. అని చంద్రబాబు ప్రశ్నించిన తీరు చంద్రబాబు ఎందుకు థర్డ్ గ్రేడ్ పొలిటీషియనో చాటి చెబుతూ ఉంది.
సినిమా టికెట్ల గురించి జగన్ ను చిరంజీవి అడిగారంటే, అది జగన్ ను వ్యక్తిగతంగా అడగడం కాదు. ముఖ్యమంత్రి హోదాను అడగడం అది అనే కనీస ఇంగితం చంద్రబాబుకు లేనట్టుగా ఉంది. సీఎం సీట్లో జగన్ ఉన్నా, మరొకరు ఉన్నా… సినిమా వాళ్లు తమ సమస్యల గురించి అడగొచ్చు. ఆ తర్వాత ఏమిటనేది వేరే సంగతి.
అయితే చంద్రబాబులా ఒక్కోరి స్థాయిని బట్టి సీఎం హోదాలో స్పందించడం దారుణం. గతంలో ఎవరో నాయీ బ్రహ్మణులు తమ సమస్యలు ఏవో చెప్పుకుంటే చంద్రబాబు వీడియోల సాక్షిగా వారిపై విరుచుకుపడ్డారు. తోకలు కత్తిరిస్తా, వెంట్రుకలు కత్తిరిస్తా.. అన్నట్టుగా ఏదేదో మాట్లాడుతూ చంద్రబాబు వారిపై విరుచుకుపడ్డారు. పెద్ద మనసు చేసుకోవాలి.. అని వారు విన్నవిస్తున్నా చంద్రబాబు చాలా దారుణంగా వారితో వ్యవహరించారు.
మరి సామాన్యులు అయిన నాయీబ్రహ్మణులు విన్నవించుకుంటే చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడారు. వారిని అవమానించి పంపారు. చేతులు జోడించుకున్న వారిని దండించి పంపిన ఘనత చంద్రబాబుది. మరి ఈయనకు ఇప్పుడు చిరంజీవి ఏపీ సీఎం జగన్ ను సినిమా టికెట్ల గురించి కాస్త విన్నవించుకుంటే చాలా బాధేస్తోంది!
చిరంజీవి అంతలా విన్నవించుకోవాలా.. అని చంద్రబాబు దీర్ఘాలు తీస్తున్నారు. సీఎం హోదాకు చిరంజీవి అయినా, నాయీబ్రహ్మణుడు అయినా అంతా ఒకటే. అలా చూస్తామనే ప్రమాణ స్వీకారం చేస్తారు సీఎంలెవరైనా. అయితే రాజకీయమే తప్ప, నాయకత్వం లక్షణాలు లేని చంద్రబాబుకు ఇలాంటివి అర్థం కాకపోవచ్చు.