రెఫరండం.. భారత ప్రజాస్వామ్యంలో పెద్దగా ప్రమేయం లేని ప్రక్రియ ఇది. చాలా అంశాల గురించి దేశంలో రెఫరండం అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అంశం గురించి కూడా రెఫరండం నిర్వహించి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే సంప్రదాయం మన దేశంలో లేనే లేదు. ప్రజాభిప్రాయాన్ని ఓట్ల రూపంలోనో, లేఖ రూపంలోనే తీసుకుని.. దాన్ని రెఫరండంగా భావించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేయడం, ఇండియాలో చాలా కీలకమైన అంశాల్లో కూడా జరగదు. ఏ యూరోపియన్ దేశాల్లోనో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
అక్కడ ప్రభుత్వ నిర్ణయాల విషయంలో అనేక రెఫరండాలు నిర్వహిస్తూ ఉంటారు. బ్రిటన్ పరిధిలో గత కొన్నేళ్లలో పలు అంశాల గురించి రెఫరండాలు సాగాయి. ఇక ఇండియాలో.. చాలా అంశాల గురించి రెఫరండాల డిమాండ్లు సాగాయి. అయితే ఏదీ అలాంటి ఓటింగ్ వరకూ రాలేదు. కశ్మీర్ అంశంలో రెఫరండం నిర్వహించాలనే డిమాండ్ చాలా పాతదే. ఇక ఏపీ విభజన అంశం గురించి రెఫరండం నిర్వహించాలనే డిమాండ్ అప్పట్లో వినిపించింది. సీమాంధ్ర నుంచినే ఆ డిమాండ్ వినిపించింది. కానీ.. అలాంటిదేమీ చేయకుండా కేంద్రం ఆ అంశంపై తన నిర్ణయం తీసుకుంది.
ఇక చంద్రబాబు నాయుడు కూడా అమరాతిని రాజధానిగా ప్రకటించినప్పుడు ఏ రెఫరండం నిర్వహించారు? ఏపీ ప్రజల అభిప్రాయం తీసుకున్నారా? ప‌్రజల వరకూ కాకుండా, కనీసం అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించలేదు! శిరామకృష్ణన్ కమిటీ నివేదికను కూడా బుట్టదాఖలు చేసి చంద్రబాబు నాయుడు తన ఇష్టానికి నిర్ణయం తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అఖిలపక్షం, రెఫరండం అనే డిమాండ్ లు చేస్తే కామెడీగా ఉంటాయి. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టుగా ఉంటుంది చంద్రబాబు వ్యవహారం అంతా!
గూగుల్లో ఎంత సెర్చ్ చేసినా ఒక్క అమ్మాయితో కూడా లింకప్ రావట్లేదు