ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ తో చంద్రబాబు నాయుడు సమావేశం అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకూ బీజేపీని తిట్టి, మోడీని తిట్టిన చంద్రబాబు నాయుడు తిరిగి మోడీ దగ్గర ప్రాపకం సంపాదించడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి యూటర్న్ లు చంద్రబాబుకు కొత్త కాదు. ఈ క్రమంలో మరోసారి ఆయన యూటర్న్ తీసుకుని మోడీకీ-బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలను విస్తృతంగా చేస్తున్నట్టుగా విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.
అందులో భాగంగా బీజేపీకి హెడ్ క్వార్టర్స్ లాంటి ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచినే చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారట. ఇలా ఆర్ఎస్ఎస్ చీఫ్ తో మంతనాల గురించి ఊహాగానాలే ఉండగా, ఇంతలోనే చంద్రబాబు నాయుడు చిన్నజీయర్ స్వామిని కలిశారు. చిన్నజీయర్ ఆశ్రమానికి వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసేశారు చంద్రబాబు నాయుడు.
ఇలా కాషాయధారుల చుట్టూ తిరుగుతూ.. చంద్రబాబు నాయుడు వారిని ప్రసన్నం చేసుకుని తద్వారా మోడీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకు యూటర్న్ లు ఏమీ కొత్త కాదు. తన అవసరానికి ఎటైనా టర్న్ తీసేసుకోగలరు. ఏమైనా మాట్లాడగలరు. ఎటొచ్చీ ఆయన ఫాలోయర్లకు కూడా ఈ యూటర్న్ లతో మతి చలిస్తుండవచ్చు!