టీడీపీ అధినేత చంద్రబాబు దాక్కొని మరీ సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియకూడదని కోరుకున్నారు. ఎందుకంటే… తన వెన్నుపోటును గుర్తు చేసినట్టువుతుందని ఆయన జాగ్రత్త పడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు తీసుకుని నిన్నటితో 26 సంవత్సరాలైంది. సహజంగా టీడీపీ స్వభావరీత్యా దీన్ని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలి. ఆ విధంగా చేయలేదు. దీనికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
1995, సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా మొదటిసారి చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. మొదటిసారి సీఎంగా బాధ్యతలు తీసుకుని 26 సంవత్సరాలైన సందర్భంగా మంగళగిరి సమీపంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కొంత మంది మహిళా నేతలు ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా బాబు కేట్ కట్ చేశారు.
ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి కూలదీసిన సంగతుల్ని లోకానికి మరోసారి గుర్తు చేసినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఈ సంబరాలకు టీడీపీ ప్రాధాన్యం ఇవ్వలేదు. 1994లో అఖండ మెజార్టీతో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు.
చంద్రబాబు సతీమణి లక్ష్మీపార్వతిని అడ్డు పెట్టుకుని ఎన్టీఆర్ను పదవి నుంచి ఏ విధంగా కూలదూసారో అందరికీ తెలుసు. వైస్రాయ్ హోటల్ ఎదుట ఎన్టీఆర్కు జరిగిన పరాభవం ఎప్పటికీ మరిచిపోలేరు.
నాటి ఘటన బాబుకు చిరస్థాయిగా వెన్నుపోటుదారుడనే మచ్చను మిగిల్చింది. అందుకే తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాననే విషయాన్ని ఆయన గర్వంగా చెప్పుకోలేకపోతున్నారు. నిన్నటి సంబరాలను సిగ్గుపడుతూ చేసుకోవడాన్ని గమనించొచ్చు. దీన్ని బట్టి ఎన్టీఆర్కు ద్రోహం చేసిన జ్ఞాపకాలు బాబును నీడలా వెంటాడుతున్నాయని చెప్పొచ్చు.