ఈ డొంక తిరుగుడు ఎందుకు చంద్రబాబు

చంద్రబాబు జీవితమే యూటర్న్ లు, నాలుక మడతల మయం. ఎప్పుడు ఏ విషయంపై యూ-టర్న్ తీసుకుంటారో ఆయనకే తెలియదు. ఆయన రాజకీయ జీవితంలో అతిపెద్ద యూటర్న్ ఏదైనా ఉందంటే అది ప్రత్యేక హోదా అంశమే.…

చంద్రబాబు జీవితమే యూటర్న్ లు, నాలుక మడతల మయం. ఎప్పుడు ఏ విషయంపై యూ-టర్న్ తీసుకుంటారో ఆయనకే తెలియదు. ఆయన రాజకీయ జీవితంలో అతిపెద్ద యూటర్న్ ఏదైనా ఉందంటే అది ప్రత్యేక హోదా అంశమే. ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నారు. దానికి కూడా కట్టుబడకుండా ఎన్నికల టైమ్ లో తిరిగి ప్రత్యేక హోదా కావాలన్నారు. ఇలా యూటర్న్ అంకుల్ అనిపించుకున్న బాబు.. ఇప్పుడు ఏపీ రాజధాని అంశంపై కూడా అదే రీతిన వ్యవహరించి అభాసు పాలవుతున్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది ముఖ్యమంత్రి జగన్ అభిమతం. అందుకు తగ్గట్టుగానే మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. నిజానికి ఇది కొత్తగా జగన్ తీసుకొచ్చిన ప్రతిపాదన కాదు. చంద్రబాబు హయాంలోనే అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగా ఇలా చేయాలని చాలామంది సూచించారు. కానీ చంద్రబాబు మాత్రం తన స్వార్థ ప్రయోజనాల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అమరావతిని రాజధానిగా ప్రకటించి ల్యాండ్ పూలింగ్ చేశారు.

ఇప్పుడు ఆ అవ్యవస్థను జగన్ సరిదిద్దే కార్యక్రమం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే చంద్రబాబుకు కోపం వచ్చింది. తన వర్గీయులతో పథకం ప్రకారం లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టించిన బాబు, ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందంటే తట్టుకోలేకపోతున్నారు. అలా అని వికేంద్రీకరణకు వ్యతిరేకం అని చెప్పలేకపోతున్నారు. సరిగ్గా ఇక్కడే బాబు నాలుక మరోసారి మడత పడింది. వికేంద్రీకరణకు తను వ్యతిరేకం కాదంటూ ప్రకటించుకున్నారు బాబు. కానీ రాజధాని మాత్రం అమరావతిలోనే ఉండాలంటున్నారు. విశాఖలో రాజధానిని పెట్టొద్దంటూ నేరుగా ప్రకటించే సాహసం మాత్రం చేయడం లేదు చంద్రబాబు.

చంద్రబాబు వితండవాదానికి మరో తార్కాణం కూడా బయటపడింది. కేవలం రాజధాని అంశం మీద ప్రభుత్వాన్ని రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని జగన్ కు బాబు సవాల్ చేస్తున్నారు. దమ్ముంటే 151 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్లాలట. బుద్ధిలేని వాదన అంటే ఇదే. గతంలో ప్రత్యేక ప్యాకేజీ పుచ్చుకున్నప్పుడు బాబు ఇలానే వ్యవహరించారా?

తన రాజకీయాల కోసం భోగీని కూడా వాడుకున్నారు బాబు. ప్రతి భోగి, సంక్రాంతికి తను తన స్వగ్రామానికి వెళ్తానని, కానీ ఈసారి రాజధాని ప్రాంతంలోనే పండగ జరుపుకుంటానంటూ విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఏర్పాటుచేసిన భోగి మంట వద్దకు చేరుకున్నారు బాబు. అమరావతిని రాజధానిగా చేసినప్పుడు మాత్రమే తెలుగు ప్రజలకు అసలైన సంక్రాంతి అంటూ అగ్గిరాజేసే ప్రయత్నం చేశారు.