ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒకప్పుడు జాతీయ స్థాయి నాయకుడిగా ఉండేవారిని, కాని ఇప్పుడు జాతి నాయకుడుగా మిగిలిపోయారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
విశాఖలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పలు విమర్శలు చేశారు. తెలుగుదేశంకు భవిష్యత్తులేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీని చంద్రబాబే చంపేస్తున్నారని, అందుకే సుజనా చౌదరి, సిఎమ్ రమేష్ వంటివారిని బిజెపిలోకి ఆయనే పంపించారని ఆయన అన్నారు. టిడిపికి ఇక భవిష్యత్తు లేదనే పలువురు ఆ పార్టీని వీడుతున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు ఒక ముసలినక్క అని, ఆయన కుమారుడు ఒక యువ నక్క అని, వారిద్దరూ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అబివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వ లేకపోతున్నారని ఆయన మండిపడ్డారు.