గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర ఓటమి చంద్రబాబును వెంటాడుతోంది. ఇంత కాలం వైఎస్ జగన్‌కు పులివెందుల ఉన్నట్టే, చంద్రబాబుకు కుప్పం కంచుకోటగా భావిస్తూ వచ్చారు.
అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర ఓటమితో ఆయనలో ఆందోళన నెలకుంది. దీంతో కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటించి టీడీపీ శ్రేణులకు భరోసా ఇచ్చేందుకు యత్నించారు. తాజాగా మరోసారి కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించేందుకు ఆయన నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు కుప్పంలో పర్యటించేందుకు ఆయన సిద్ధమయ్యారు. రేపు కుప్పం బహిరంగ సభలో, 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటిస్తారు. రామకుప్పం మండలంలో రోడ్‌షోలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 14న కుప్పం, గుడుపల్లి మండలాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించనున్నారు. వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ప్రధానంగా అధికార పార్టీ నుంచి వచ్చే ప్రలోభాలకు తలొగ్గకుండా, పార్టీతో కలిసి నడిచేలా , భవిష్యత్‌పై భరోసా కల్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించనున్నారు.
మరోవైపు కుప్పంలో పునాదులు కదులుతుండడంతో చంద్రబాబు నెలల వ్యవధిలోనే అక్కడికి ఎళుతున్నారని వైసీపీ విమర్శిస్తోంది. గతంలో కనీసం నామినేషన్‌కు కూడా వెళ్లని చంద్రబాబులో తాజాగా వచ్చిన మార్పుగా వైసీపీ నేతలు చెబుతున్నారు.