సునీత దంపతుల కొంపముంచిన చంద్రబాబు నీతి

చాణక్యనీతి గురించి విన్నాం. విదురనీతి గురించి కూడా అంతో ఇంతో విన్నాం. ఇక పంచతంత్రం కథల్లో నీతి గురించి, భర్తృహరి శతకంలోని నీతి పాఠాల గురించి తరతరాలుగా వింటూనే ఉన్నాం.  Advertisement కానీ వీటన్నిటికీ…

చాణక్యనీతి గురించి విన్నాం. విదురనీతి గురించి కూడా అంతో ఇంతో విన్నాం. ఇక పంచతంత్రం కథల్లో నీతి గురించి, భర్తృహరి శతకంలోని నీతి పాఠాల గురించి తరతరాలుగా వింటూనే ఉన్నాం. 

కానీ వీటన్నిటికీ భిన్నమైన నీతి ఒకటుంది. అదే చంద్రబాబు నీతి. ఆధునిక రాజకీయయుగంలో ఈ చంద్రబాబునీతికి మించిన కుటిల కుత్సిత కుతంత్రనీతి ఇంకొకటి లేదు. 

అదేవిటంటే..శత్రుపక్షంలో ఎవడు అసంతృప్తితో ఉన్నాడనిపించినా వెంటనే వాడిని గేలమేసి పట్టుకుని కపటసానుభూతి చూపించి, వాడిని ఉద్ధరిస్తున్నట్టుగా భ్రమకల్పించి, తోలుబొమ్మని చేసి ఆడించి చివరికి వాడిని నిండా నట్టేట ముంచేయడమన్నమాట. 

అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే ఈ ప్రోసెస్ లో చంద్రబాబు పక్షానికి పదిపైసల ఉపయోగం కూడా ఉండదు. గేలమేసి ఎవడ్నైతే తీసుకొస్తారో వాడికీ ఉపయోగముండదు. కానీ చంద్రబాబు వర్గానికి కానీ, గేలంలో చిక్కినవాడికి కానీ ఈ సత్యం బోధపడదు. తమకు నచ్చిన విధంగా ఏదో జరిగిపోతుందని కలలుగని ఇరువర్గాలూ తమ మాయలో బతికి, తాము తీసుకున్న గోతిలోనే పడుతుంటారు. 

వివేకానందరెడ్డి హత్య జరిగి ఇన్నేళ్లవుతున్నా హత్యకి సూత్రధారెవరో తెలియక మల్లగుల్ల్లాలు పడుతున్నాయి వ్యవస్థలు కూడా. ఎవరి స్థాయిలో వాళ్లు బుద్ధిని, మనసుని అనుసరించి అనుమానితుల లిస్టుని మాత్రం తయారు చేసుకున్నారంతే. 

తెదేపా వారు సీబీయై ఎంక్వైరీ కావాలని కోరారు. జగన్ మోహన్ రెడ్డి వెంటనే స్వాగతించారు. సీబీయై దిగి చాలానాళ్లయింది. అయినా ఇప్పటికీ హత్యకి మూలపురుషుడెవరో తెలియరావట్లేదు. 

ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లో హత్య జరిగినప్పటి కాలంలోకి వెళ్దాం.

హత్య జరిగిన వెంటనే తొలుత గుండెపోటని చెప్పారు. తర్వాత హత్య అని తేలింది. ఆ సమయంలో వివేకా కుమార్తె సునీత విలేకరుల ప్రశ్నలకి సమాధానం చెప్పడంలో భాగంగా అసలు జగన్ మోహన్ రెడ్డికి ఇందులో ఎటువంటి సంబంధమూ లేదని నొక్కివక్కాణించారు. పైగా చంద్రబాబు కుట్ర ఉండచ్చేమో అని కూడా అన్నారు. 

ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎలాగూ వచ్చేది జగన్ ప్రభుత్వమే కనుక చంద్రబాబు మీద బురదజల్లి జగన్ కి దగ్గరవ్వాలనుకున్నారు. రాజకీయంగా తమ మనుగడకి జగనే దిక్కనుకున్నారు. జగన్ మనసు గెలుచుకుని ఏ మెడికల్ కాలేజో, ఏ ఎమ్మెల్సీ పదవో పొంది తమ పద్ధతిలో కాలక్షేపం చేద్దామనుకున్నారు. 

అయితే కొన్ని గతానుభవాల దృష్ట్యా జగన్ మోహన్ రెడ్డి కి నర్రెడ్డి అంటే పడదు. అతనిని ఎంత దూరంలో పెట్టాలనుకున్నాడో అంతే దూరంలో పెడుతూ వచ్చాడు. 

అనుకున్నట్టే జగన్ ప్రభుత్వమొచ్చింది. కానీ జగన్ మనసు కరగట్లేదు. చిన్నాన్న కూతురు సునీతని, ఆమె భర్తని దగ్గరకి తీసుకోవట్లేదు. 

దాంతో వీళ్లల్లో అసంతృప్తి మొదలైంది. 

అంతే ఎక్కడ అసంతృప్తున్నా వాసన పసిగట్టగల శక్తి చంద్రబాబు వర్గమైన పచ్చ మీడియాకుందికనుక వెంటనే గేలమేసి నర్రెడ్డి దంపతుల్ని పట్టుకున్నారు. ఏవో లెక్కలు చెప్పి, అరచేతిలో స్వర్గాన్ని చూపి తమ వశం చేసుకున్నారు. ఏమాత్రం వివేకం లేని వివేకా కూతురు, అల్లుడు వాళ్ళ బుట్టలో పడ్డారు. 

పచ్చమీడియాని నమ్మడమంటే పంచతంత్రం కథల్లోని గుంటనక్కని నమ్మినట్టే. 

సునీత తన తండ్రి హత్య జరిగినప్పుడు చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు ఈ హత్యలో జగన్ హస్తముందేమో అన్న అనుమానాలు వెలిబుచ్చుతోందంటే నోటికి ఎంతెలా పచ్చపసరు పూసేసుకుందో తెలిసిపోతోందిగా. 

సీబీయై ఎంక్వైరీ వేసే దాకా గగ్గోలు పెట్టాడు చంద్రబాబు. తీరా సీబీయై రంగంలోకి దిగాక దాని పనిని అది చేసుకోనివ్వకుండా ఈ డ్రామా పాలిటిక్స్ నడుపుతున్నాడు. అంటే ప్రజల్ని, వ్యవస్థల్ని ఏదో విధంగా ప్రభావితం చేసి జగన్ ఇమేజ్ ని భ్రస్టుపట్టించి రానున్న 2024 ఎన్నికల్లో ఓడించేయాలని తపన. 

కానీ తానొకటి తలస్తే పైవాడొకటి తలచాడన్నట్టు ఇప్పుడీ డ్రామా అంతా బెడిసిగొట్టి నర్రెడ్డి-సునీత దంపతుల మీద కూడా అనుమానాలు కలిగించినడం మొదలు పెట్టింది. 

ముందు నుంచీ కుమార్తె సునీత చేతిలో ఒక బ్రీఫ్ కేస్ పట్టుకుని తనకు న్యాయం చేయమని కోర్టుల చుట్టూ తిరగడం చూసి అయ్యో అనుకున్నారు పలువురు. 

అయితే ఇప్పుడు కొత్తనుమానాలొస్తున్నాయి. 

నేరం చేసినవాళ్లే అనుమానం రాకూడదని విక్టిం కార్డ్ ప్లే చేస్తారట. ఒకవేళ ఈ కేసుని ఆ కోణంలో కూడా చూడాలా అనే ఆలోచనలొస్తున్నాయి. 

ఎందుకంటే సునీత దంపతులు మాట మార్చడమే ఇందులో ప్రధానమైన ట్విస్టు. ఇన్నాళ్లుగా జగన్ మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెప్పి ఇప్పుడు సడెన్ గా ఉందని అనుమానమంటుంటే వీళ్ల మీదే అనుమానమొస్తోంది. 

ఆ అనుమానానికి కారణాలు కూడా ఉన్నాయి. 

సునీత తన తండ్రి వివేకానందరెడ్డికి మొదటి భార్య సంతానం. తర్వాత ఆయన మరొక యువతిని పెండ్లాడాడు. తమకి చెందాల్సిన ఆస్తి ఆమెకెక్కడికి పోతుందోనని సునీత ఆమెతో తెగ గొడవపడేదని విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో సునీతకు వివేకా రెండవ భార్యకు మధ్యన జరిగిన వివాదాస్పదమైన సంభాషణ కూడా భద్రంగా ఉందట. అందులో సునీత వినడానికి కూడా వీల్లేని పచ్చిబూతులు తిట్టిందని సమాచారం. అది బయటపెడితే కుటుంబం పరువు మంటకలుపుకోవడం తప్ప మరొకటేమీ ఉండదని దానిని బయటపెట్టడంలేదట. 

ఏది ఏమైనా ఒక కేసులో మాట మార్చేవారిపైనే అనుమానాలెక్కువౌతాయి. 

నర్రెడ్డికి మొదటి నుంచీ పదవీకాంక్ష ఉంది. వైయెస్సార్ చనిపోయాక ఆ కుటుంబానికి చెందిన రాజకీయ వారసత్వం కొడుకు జగన్ కి కాకుండా తన మామ వివేకాకి వచ్చేలా కొన్ని ప్రయత్నాలు చేసాడు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మామ వివేకాని వ్యవసాయశాఖా మంత్రిగా నిలబెట్టుకున్న పైరవీఘనుడు నర్రెడ్డి.  ఫలితంగా అయన్ని అడ్డం పెట్టుకుని పలురకాలుగా పదవీదుర్వినియోగం చేసుకున్నాడు కూడా.

క్రమంగా వైఎస్సార్ సతీమణి విజయమ్మకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీనుంచి నిలబెట్టాడు తన మామయ్యని నర్రెడ్డి. 

ఆ విధంగా ఉన్న బంధుత్వాల్ని తన స్వార్థానికి, సంపాదనకి వాడుకోవాలన్నది నర్రెడ్డి ఆలోచన. 

ఇలాంటి ఆలోచనున్న నర్రెడ్డి, ఆస్తి విషయంలో సవతి తల్లి పోరున్న తన భార్య సునీత వివేకా హత్యలో హస్తాలు కాకపోవచ్చు. కానీ అనుమానాలైతే రాకుండా ఆగవు. 

ఇన్నాళ్లూ లేని ఈ అనుమానాలు రేకెత్తిచ్చిన ఘనత చంద్రబాబునీతిని ఫాలో అయిన పచ్చమీడియాదే అని వేరె చెప్పక్కర్లేదు. 

నిన్నటి వరకు బాధితులుగా ఉన్న నర్రెడ్డి దంపతులు నేడు నేరస్థులేమోనని అనుమానొస్తోందంటే…ఎవరు మాత్రం చేయగలరు?పచ్చ మీడియాని నమ్ముకున్నందూ ఆ దంపతులు ఆ మాత్రం అనుభవించకతప్పదు. 

– కంచికచర్ల మధుసూదన్