చంద్రబాబు పాలన.. విస్మయకరమైన వాస్తవాలు!

తొలి ఆరునెలల్లో చంద్రబాబు నాయుడి విదేశీయానా ఖర్చు ఎనిమిది కోట్ల రూపాయలా ముప్పై మూడులక్షలా తొంభై ఎనిమిది వేలా నాలుగు వందల నలభై మూడు రూపాయలు అని ప్రభుత్వ గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఐదు…

తొలి ఆరునెలల్లో చంద్రబాబు నాయుడి విదేశీయానా ఖర్చు ఎనిమిది కోట్ల రూపాయలా ముప్పై మూడులక్షలా తొంభై ఎనిమిది వేలా నాలుగు వందల నలభై మూడు రూపాయలు అని ప్రభుత్వ గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఐదు సంవత్సరాల కిందట అధికారం చేపట్టగానే తొలి ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు మొత్తం పదమూడు విదేశీ పర్యటనలు చేపట్టాడట. తిరిగిన దేశాలనే మళ్లీ మళ్లీ తిరిగారు. 

అలా తొలి ఆరు నెలల్లోనే నెలపాటు విదేశాల్లో గడిపాడట చంద్రబాబు నాయుడు. అందుకు అయిన ఖర్చు వివరాలు ఇవి. తొలి ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు అలా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా అదే కథ రిపీట్ అయ్యింది. తొలి ఆరునెలల పర్యటనల ఖర్చులకు సంబంధించిన వివరాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

''చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఒక పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొదటి ఆరునెలల్లో సారు నెలరోజులు విదేశాల్లోనే గడిపారు. మందీ మార్బలాన్ని వెంటేసుకుని సింగపూర్, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ సందర్శించారు. ఏం సాధించారో ఎక్కడా కనిపించదు.

2018 ఫిబ్రవరిలో విశాఖలో అట్టహాసంగా జరిపిన పార్టనర్షిప్ సమిట్లో రూ.4.50 లక్షల కోట్ల పెట్టుబడులపై సంతకాలు జరిగాయని చంద్రబాబు ప్రకటించారు. 100 కోట్ల వృథా ఖర్చు తప్ప రూపాయి పెట్టుబడి రాలేదు. నీతి ఆయోగ్ బిత్తరపోయిందట ఈయన స్టేట్మెంట్ చూసి. ఐదేళ్లూ ఇలాగే మభ్య పెట్టారు ప్రజలను.

చంద్రబాబు నైజమే అంత. 2004, 09 ఎన్నికల్లో పరాజయం పాలైనప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. తనను ఓడించినందుకు ప్రజలను తప్పుపట్టారు తప్ప వారి విశ్వాసం ఎందుకు పొందలేకపోయాం అనే ఆత్మవిమర్శ ఎన్నడూ చేసుకోలేదు. ఇప్పుడూ అంతే. ఎందుకు ఓడామో అంతుబట్టట్లేదంటున్నాడు. కుక్క తోక వంకరే.'' అంటూ వరస ట్వీట్లలో విరుచుకుపడ్డారాయన.

ఆత్మవిమర్శ అవసరం.. టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!