అశోక్ టోన్ లో మార్పు… ?

కేంద్ర మాజీ మంత్రి, పూసాపాటి వారి వంశాధీశుడు అశోక్ గజపతిరాజు ఉన్నత చదువులు చదివారు. ఆయన కులం, మతం వంటి సంకుచిత భావాలకు దూరంగా ఉంటారు. అటువంటి అశోక్ నోట తొలిసారిగా హిందువులు, మతాలు…

కేంద్ర మాజీ మంత్రి, పూసాపాటి వారి వంశాధీశుడు అశోక్ గజపతిరాజు ఉన్నత చదువులు చదివారు. ఆయన కులం, మతం వంటి సంకుచిత భావాలకు దూరంగా ఉంటారు. అటువంటి అశోక్ నోట తొలిసారిగా హిందువులు, మతాలు అంటూ కొత్త మాటలు వస్తున్నాయి.

హిందువుల మీద కుట్ర చేస్తారా అంటూ ఆయన వైసీపీ సర్కార్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడిపోయారు. ఇప్పటిదాకా ఈ మాటలు బీజేపీ నుంచి వచ్చేవి. ఆ మధ్యన రామతీర్ధం లో చంద్రబాబు కూడా హిందూత్వం మీద గట్టిగానే మాట్లాడారు.

ఇపుడు అశోక్ అచ్చమైన హిందువుల బంధువు తాను అంటున్నారు. ఆయన ఆధ్యాత్మిక క్షేత్రమైన సింహాచలం దేవస్థానానికి చైర్మన్ గా తిరిగి నియమితులయ్యారు. ఆయన గతంలో కూడా ఇదే పదవిని నిర్వహించారు. 

నాడు లేని మతాలు ఇపుడు ఎందుకు వస్తున్నాయి అన్నదే చర్చగా ఉంది. అశోక్ వంటి ప్రగతిశీల భావాలు ఉన్న వారు ఇలా మాట్లాడడం మేధావులకు కూడా ఆశ్చర్యంగా ఉంది.

ఏది ఏమైనా ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు. దాంతో వైసీపీ మీద వేరే మతాల ముద్ర వేసేందుకు టీడీపీ అధినాయకత్వం ట్రై చేస్తున్నట్లుగానే ఈయన కూడా చేస్తున్నారా అన్నదే డౌట్.  

చూడాలి మరి ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉండాలని అంటూనే మరో వైపు విమర్శలు చేస్తున్న ఈ తీరుతో అశోక్ ఎలా నెట్టుకువస్తారో.