జ‌బ‌ర్ద‌స్త్‌లో ఉండాల్సిన క్యారెక్ట‌ర్‌!

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ క‌మ్ ద్వంద్వార్థాల ఆ షో ఎంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ షో జ‌డ్జీలుగా రోజా, నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు నాగ‌బాబు వ్య‌వ‌హ‌రిస్తూ వచ్చారు.  Advertisement వైసీపీ వ్య‌తిరేక మీడియా గ్రూప్‌న‌కు…

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ క‌మ్ ద్వంద్వార్థాల ఆ షో ఎంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ షో జ‌డ్జీలుగా రోజా, నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు నాగ‌బాబు వ్య‌వ‌హ‌రిస్తూ వచ్చారు. 

వైసీపీ వ్య‌తిరేక మీడియా గ్రూప్‌న‌కు సంబంధించిన చాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌య్యే ఆ కామెడీ షోకు న్యాయ నిర్ణేత‌గా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్య‌వ‌హ‌రించ‌డంపై ప‌లు విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అయినా ఆ షోలో రోజా ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా ఆ కామెడీ షోలో ఉండాల్సిన ఓ క్యారెక్ట‌ర్ గ‌త కొన్నేళ్లుగా రాజ‌కీయ తెర‌పై హాస్యం పండిస్తోంది. ఇదే ఏ కామెడీ షోలో లేదా సినిమాల్లో మొద‌టి నుంచి ఆయ‌న న‌టించి వుంటే ఈ పాటికి రేలంగి, రాజ‌బాబు, ర‌మ‌ణారెడ్డి, అల్లు రామ‌లింగ‌య్య స‌ర‌స‌న చేరి ఉండేవార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంత‌టి హాస్య చ‌తుర‌త క‌లిగిన ఆయ‌న మ‌రెవ‌రో కాదు …ది గ్రేట్ టీడీపీ లీడ‌ర్‌, మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి.

ఆయ‌న‌లోని హాస్య న‌టుడు ఈ రోజు మ‌రోసారి బ‌య‌టికొచ్చాడు. అనంత‌పురంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌న‌దైన స్టైల్‌లో న‌వ్వులు పండించారు. 

సీఎం జగన్ ఒక రోజు ఆదాయం రూ. 300 కోట్లు అని కామెంట్స్ చేశారు. అయితే ఇది ఎంతవరకు నిజమో? అబద్ధమో? తెలియదంటూ, ఈ విష‌య‌మై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని భ‌లే కామెడీగా చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని బ్రహ్మాండంగా  అభివృద్ధి చేశారన్నారు. అయినా వైసీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారన్నారు.

జేసీ లెక్క‌ల ప్ర‌కారం టీడీపీ గెలుపొందిన చోట డ‌బ్బులు బాగా పంచార‌ని అర్థం చేసుకోవాలేమో! రాజ‌కీయాల నుంచి విర‌మించామ‌ని చెబుతూనే …పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఓట‌మి జీర్ణించుకోలేక ఇష్టానుసారం మాట్లాడ్డం మ‌రీ ముఖ్యంగా జేసీ బ్ర‌ద‌ర్స్‌కే చెల్లింది.

దేశం మౌనం పాటిస్తోంది

ఆ పేరు కూడా పలకను