చిరంజీవికి కరోనా ఉత్తిదే

తను కరోనా బారిన పడినట్టు 4 రోజుల కిందట చిరంజీవి స్వయంగా ప్రకటించారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలని చెప్పిన చిరంజీవి,…

తను కరోనా బారిన పడినట్టు 4 రోజుల కిందట చిరంజీవి స్వయంగా ప్రకటించారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలని చెప్పిన చిరంజీవి, ఆ వెంటనే హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. వైద్యుల పర్యవేక్షణలో మందులు కూడా వాడడం స్టార్ట్ చేశారు.

కట్ చేస్తే.. 4 రోజుల్లోనే చిరంజీవికి కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి కిందట ఆయన స్వయంగా ప్రకటించారు. తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని చెప్పడంతో పాటు.. మొట్టమొదట చేసిన కరోనా టెస్టును తప్పుడు పరీక్షగా ప్రకటించారు. అంటే, చిరంజీవికి అసలు కరోనానే లేదన్నమాట.

“నాకు ఎలాంటి లక్షణాల్లేవు. అనుమానమొచ్చి అపోలో వైద్యుల్ని అప్రోచ్ అయ్యాను. వాళ్లు సీటీ స్కాన్ తీసి ఛెస్ట్ లో ఎలాంటి ట్రేసెస్ లేవని తేల్చారు. అక్కడ రిజల్ట్ నెగెటివ్ వచ్చిన తర్వాత మరొక్కసారి మరోచోట నివృత్తి చేసుకుందాని నేను టెనెట్ ల్యాబ్ లో 3 రకాల కిట్స్ తో టెస్ట్ కూడా చేయించాను. 

అక్కడ కూడా నెగెటివ్ వచ్చింది. ఫైనల్ గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన చోటు కూడా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించాను. అక్కడ కూడా నెగెటివ్ వచ్చింది. ఈ 3 రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్ట్, ఫాల్టీ కిట్ వల్ల వచ్చిందని డాక్టర్లు నిర్థారణకు వచ్చారు.”

ఇలా తనకు కరోనా సోకలేదనే విషయాన్ని చిరంజీవి ప్రకటించారు. కాలం-కరోనా గడిచిన 4 రోజులుగా తనను కన్ఫ్యూజ్ చేసి ఆడేసుకున్నాయన్న చిరంజీవి.. ఆ టైమ్ లో తనపై ప్రేమానురాగాలు చూపించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

మన ప్రతాపం అంతా ఆంధ్రలోనే