మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగం ప్రారంభం

భారత్ లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయి. క్లినికల్ ట్రయిల్స్ లో భాగంగా ప్రయోగాత్మకంగా తయారుచేసిన వాక్సీన్ ను ఇప్పుడు మనుషులపై ప్రయోగిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో…

భారత్ లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయి. క్లినికల్ ట్రయిల్స్ లో భాగంగా ప్రయోగాత్మకంగా తయారుచేసిన వాక్సీన్ ను ఇప్పుడు మనుషులపై ప్రయోగిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో ఇద్దరు వాలంటీర్లకు ఈరోజు ఫస్ట్ డోస్ ఇచ్చారు.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగా కరోనా వ్యాక్సిన్ తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రయోగశాలలో ప్రాథమిక పరీక్షలు ముగిసిన తర్వాత మనుషులపై ప్రయోగానికి ఈ సంస్థ దరఖాస్తు చేసుకుంది.

దీనికి డీసీజీఐ అనుమతి లభించడంతో.. దేశవ్యాప్తంగా 12 పెద్ద ప్రభుత్వ హాస్పిటల్స్ లో మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ఈరోజు నుంచి మొదలయ్యాయి. హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కూడా ఈ జాబితాలో ఉంది. వాలంటీర్ గా ముందుకొచ్చిన ఇద్దరు వ్యక్తులపై ఈ వ్యాక్సిన్ తొలి డోస్ ను ఈరోజు వేశారు.

భారత్ బయోటెక్ తయారుచేస్తున్న వాక్సిన్ కంటే రష్యా, జర్మనీ, చైనా దేశాల్లో తయారవుతున్న వ్యాక్సీన్ ప్రయోగాలు అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఉన్నారు. ఆయా దేశాల్లో మనుషులపై ప్రయోగాలు ఆల్రెడీ పూర్తిచేశారు. అయితే దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్ కావడం వల్ల.. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే.. తక్కువ ధరకే ఇండియాలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.

అంతేకాకుండా.. ధనిక దేశాలన్నీ ఇండియా నుంచే వ్యాక్సిన్ ను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఆగస్ట్ 15 నాటికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ను సిద్ధం చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది భారత్ బయోటెక్ సంస్థ.

చిలుకూరు ఆల‌యంలో అద్భుతం