కామెడీ.. దాడుల గురించి పరిటాల శ్రీరామ్‌ ఇలా!

కోడెల శివప్రసాద్‌ రావు మరణానంతరం తెగ స్పందించిన తెలుగుదేశం నేతల్లో పరిటాల శ్రీరామ్‌ కూడా ఒకరు. కోడెల ఆత్మహత్య చేసుకుని మరణించిన అనంతరం.. హైదరాబాద్‌లోనే శ్రీరామ్‌ మాట్లాడారు. ప్రభుత్వ వేధింపులు భరించలేక కోడెల మరణించినట్టుగా…

కోడెల శివప్రసాద్‌ రావు మరణానంతరం తెగ స్పందించిన తెలుగుదేశం నేతల్లో పరిటాల శ్రీరామ్‌ కూడా ఒకరు. కోడెల ఆత్మహత్య చేసుకుని మరణించిన అనంతరం.. హైదరాబాద్‌లోనే శ్రీరామ్‌ మాట్లాడారు. ప్రభుత్వ వేధింపులు భరించలేక కోడెల మరణించినట్టుగా శ్రీరామ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ వేధింపులు, దాడులు.. వీటి గురించి మాట్లాడాల్సిన అర్హత ఎవరికైనా ఉందంటే అది పరిటాల శ్రీరామ్‌కే అని స్థానికులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

పరిటాల శ్రీరామ్‌ రాజకీయ ప్రతిదాడులు, వేధింపుల గురించి మాట్లాడటానికి మించిన కామెడీ ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. పరిటాల శ్రీరామ్‌ తండ్రి పరిటాల రవి జమానాను పక్కనపెట్టి చూసినా, పరిటాల రవి కాలం నాటి జరిగిన పనుల గురించి పక్కనపెట్టి.. శ్రీరామ్‌ జమానాలో జరిగిన పనులను ప్రస్తావించుకున్నా.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత ప్రహసనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటూ ఉన్నారు.

గత ఐదేళ్లలో రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నోదాడులు జరిగాయి. కొన్ని హత్యలు కూడా జరిగాయి. రాప్తాడు తహశీల్దార్‌ కార్యాలయంలో ప్రసాద్‌రెడ్డి అనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతను దారుణంగా హత్యచేశారు. ప్రభుత్వ కార్యాలయంలోనే అలా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక నేతను దారుణంగా నరికి హతమార్చారు. పని ఉందని పిలిపించి అలా హత్యచేశారు.

అంతవరకూ ఎలాంటి ఫ్యాక్షన్‌ నేపథ్యంలేని ఒక రాజకీయ నేతను కూడా అలా అత్యంత దారుణంగా హతమార్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో హత్యలు జరిగేంత స్థాయిలో పరిటాల శ్రీరామ్‌ నియోజకవర్గంలో శాంతిభద్రతలు వర్ధిల్లాయి. ఆ తర్వాత కందుకూరు సమీపంలో మరో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తను దారుణంగా హతమార్చారు. కొడుకుతో కలిసి పొలానికి వెళ్తున్న వ్యక్తిని తెలుగుదేశం పార్టీ వాళ్లు దారుణంగా హత్యచేశారు.

అదీ పరిటాల రాజ్యం అంటే. అందుకు ప్రతిఫలంగా ప్రజలు కూడా వాళ్లను ఓడించారు. పరిటాల శ్రీరామ్‌ తను పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే ఓటమి పాలయ్యాడు. తమకు తిరుగులేదు అని విర్రవీగిన వాళ్లకు అంతకన్నా పరాభవం లేదు. అయితే ఇప్పుడు పరిటాల శ్రీరామ్‌ కూడా వచ్చి సూక్తులు చెప్పడం కామెడీగా మారింది.

శాంతిభద్రతలు, రాజకీయ దాడులకు కేరాఫ్‌గా నిలిచారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు పరిటాల కుటుంబీకులు. పరిటాల హయాంలో ఆర్వోసీ ముసుగులో అనేకమంది కాంగ్రెస్‌ నేతలను దారుణంగా హతమార్చారనే అభియోగాలున్నాయి. కొన్ని వందల మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్పుడు హతమయిన దాఖలాలు ఉన్నాయి. అవన్నీ ఎవరు చేశారో ఎలాంటి రుజువులు లేవు. అదంతా శాంతిభద్రతల పర్యవేక్షణే!

ఇప్పుడు కుటుంబ కారణాలతో తెలుగుదేశం నేతలు ఆత్మహత్యలు చేసుకున్నారనే మాట వినిపిస్తున్నా.. ఇవి మాత్రం శాంతిభద్రతలు  క్షీణించడం.. దానికి పరిటాల శ్రీరామ్‌ వంటి వాళ్ల వ్యాఖ్యానం! ఇదే తెలుగుదేశం పార్టీ మార్కు గాంధేయవాదం అని ప్రజలు అంటున్నారు.

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి