టీఆర్ఎస్ కు చెలగాటం, విపక్షాలకు సంకటం!

నల్లగొండ ఎంపీ సీటును నెగ్గినప్పుడు కలిగిన ఆనందం సంగతెలా ఉన్నా, హుజూర్ నగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సీటును గెలవకపోతే.. లోక్ సభ ఎన్నికల్లో సాధించిన విజయాల గాలి…

నల్లగొండ ఎంపీ సీటును నెగ్గినప్పుడు కలిగిన ఆనందం సంగతెలా ఉన్నా, హుజూర్ నగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సీటును గెలవకపోతే.. లోక్ సభ ఎన్నికల్లో సాధించిన విజయాల గాలి పోతుంది. ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితీ అలానే ఉంది. లోక్ సభ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపగానే.. ప్రత్యామ్నాయం తామే అని ప్రకటించుకుంటున్నారు ఆ పార్టీ వాళ్లు. అయితే హుజూర్ నగర్ లో బీజేపీ ఎంత ప్రభావం చూపుతుందో అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇక ఉప ఎన్నికల స్పెషలిస్టు తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ పార్టీ మనుగడ అంతా ఉప ఎన్నికల్లోనే ఉంటుంది. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి మీద సానుభూతి కూడా ఉందంటున్నారు. ఇలాంటి క్రమంలో ఈ బైపోల్ లో గెలిచి సత్తా చూపిస్తామని.. తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు గట్టి విశ్వాసంతో చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు వేరే లెక్కల ప్రకారం జరిగాయని, అసెంబ్లీ ఎన్నికలంటూ వస్తే వాటిల్లో తమ హవానే ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి నొక్కి వక్కాణిస్తోంది. హుజూర్ నగర్ లో గెలిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి వాదనకు ఊపు వస్తుంది.

అంతగా టీఆర్ఎస్ ఓడినా.. రెండోస్థానం లేదా, భారీ ఓట్ల శాతం ఖాయమే. ఓడిపోతే.. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత సీటు అని, పీసీసీ అధ్యక్షుడి సొంత సీట్లో కాంగ్రెస్ గెలవడం గొప్పేమీ కాదనొచ్చు. ఎటొచ్చీ బీజేపీ పరిస్థితి ఏమవుతుందో అనేది ఆసక్తిదాయకంగా మారింది. హుజూర్ నగర్ వంటి సీట్లోనే బీజేపీ సత్తా చూపించలేకపోతే.. ఆ పార్టీ పరిస్థితి ఏమిటో జనాలకు కూడా పూర్తి స్పష్టత వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కమలనాథులు కనీసం.. కాంగ్రెస్ సీటునైనా నెగ్గాలి కదా! అని విశ్లేషకులు అభిప్రాయాపడుతున్నారు.

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి