రాహుల్ పూర్తిగా కాడె పడేసినట్టే!

గత కొంతకాలంగా కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్టుగా ఉన్నారు రాహుల్ గాంధీ. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జాతీయాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. బతిమాలినా ఆ పదవిలో కూర్చోలేదు. చివరకు చేసేదిలేక సోనియాగాంధీనే…

గత కొంతకాలంగా కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్టుగా ఉన్నారు రాహుల్ గాంధీ. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జాతీయాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. బతిమాలినా ఆ పదవిలో కూర్చోలేదు. చివరకు చేసేదిలేక సోనియాగాంధీనే మళ్లీ ఆ పదవిని తీసుకున్నారు. ఇంతలోనే కాంగ్రెస్ కు కొత్త పరీక్ష వచ్చింది.

అదే హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు రాష్ట్రాలకూ ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ఐదేళ్ల కిందట ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండేది. రెండువేల పద్నాలుగు లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుఅయ్యాకా.. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజార్చుకుంది. అలా కాంగ్రెస్ పతనం ఈ రాష్ట్రాలతో తీవ్రస్థాయికి చేరింది.

కేంద్రంలో అధికారం కోల్పోయిన కొన్ని నెలల్లోనే… మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత వరసగా పడటమే కానీ, లేవడం పెద్దగాలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ నేఫథ్యంలో మళ్లీ ఆ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఐదేళ్ల కిందట తాము అధికారాన్ని కోల్పోయిన రాష్ట్రాల్లో.. ఇప్పుడు కాంగ్రెస్ మళ్లీ పాగావేస్తే అంతకుమించి సంచలనం ఉండదు. కానీ అంత సంచలనానికి అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.

ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక వ్యవహారాల్లో రాహుల్ గాంధీ అస్సలు తలదూర్చడం లేదట. ఇదంతా తనకు సంబంధం లేని వ్యవహారంలా ఆయన భావిస్తున్నారట. మరి ప్రచారం వైపు అయినా రాహుల్ వెళ్తారో, లేక ఆ విషయంలోనూ నిర్వేదాన్నే చూపిస్తారో!

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి