గత ఐదేళ్లలోనే పెరిగిందా మోడీజీ.. కామెడీగా!

'విదేశాల్లో భారత్ మీద గౌరవం అపారంగా పెరిగింది.. గత ఐదేళ్లలోనే అది పెరిగింది..' అని చెప్పుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. విదేశాల్లో భారత్ మీద గౌరవం పెరిగిందని మోడీ చెప్పుకోవడం బానే ఉంది కానీ, గత…

'విదేశాల్లో భారత్ మీద గౌరవం అపారంగా పెరిగింది.. గత ఐదేళ్లలోనే అది పెరిగింది..' అని చెప్పుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. విదేశాల్లో భారత్ మీద గౌరవం పెరిగిందని మోడీ చెప్పుకోవడం బానే ఉంది కానీ, గత ఐదేళ్లలోనే పెరిగిదంటూ.. తన పాలనను కీర్తించుకుంటున్నారు మోడీ.  నూటా ముప్పై కోట్ల మంది భారతీయులపై విదేశాల్లో గౌరవం పెరిగిందని అంటూనే.. అది 'గత ఐదేళ్లలోనే..' అంటూ మోడీ చెప్పుకుంటున్నారు.

అంటే పూర్తిగా తనవల్లనే దేశానికి గౌరవం పెరిగిందని చెప్పుకోవడం మోడీ ఉద్దేశం. ఇందులో డౌట్ ఏమీలేదు. నూటా ముప్పై కోట్లమంది భారతీయులు అనే వాళ్లు మోడీ పాలనకు ముందు కూడా ఉన్నారు. కొద్దోగొప్పో అప్పట్లో జనాభా కాస్త తక్కువ ఉండొచ్చు. మోడీకి ముందు కూడా భారతదేశం అవసరం మిగతా ప్రపంచానికి ఎంతోకొంత ఉండింది. అప్పుడు ఎంత అవసరమో, ఇప్పుడు కూడా అంతే అవసరం ఉంది. బహుశా కొత్తగా పెరిగింది కానీ, తగ్గింది కానీ ఏమీలేకపోవచ్చు.

అయితే గత ఐదేళ్లలోనే భారత్ పై విదేశాల్లో గౌరవం పెరిగిందని చెప్పుకోవడం మాత్రం మోడీ మార్కు రాజకీయం అనిచెప్పాలి. మోడీని భారతీయులు భారీ భారీ మెజారిటీలతో గెలిపించి ఉండవచ్చు. కానీ ఇలా మాట్లాడితే మాత్రం ప్రహసనంగా ఉంటుంది. ఎంతో చరిత్ర ఉంది భారతదేశానికి అని చెప్పేదీ భారతీయ జనతా పార్టీ వాళ్లే. గౌరవం అంతా గత ఐదేళ్లలోనే వచ్చిందని చెబుతున్నదీ వీళ్లే.

భారతీయులు గొప్ప ఎన్నికల ఫలితాలను ఇచ్చారని కూడా మోడీ చెప్పుకుంటున్నారు. అంటే తనను గెలిపించారు కాబట్టి.. గొప్ప ఫలితాన్ని ఇవ్వడం అనమాట. అయినా ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు మోడీ సార్, గొప్ప ఫలితాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయని కూడా తమరు గమనించాలేమో మోడీజీ! అని అంటున్నారు పరిశీలకులు.

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి