కోడెలపై ఆగని ఫిర్యాదుల పరంపర!

ఒకటా రెండా.. కోడెల కుటుంబీకులపై పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల సంఖ్య పదుల్లోకి చేరింది. ఒకరకమైన అక్రమాలు కాదు, అనేక రకమైన అక్రమాల గురించి కోడెలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉండటం గమనార్హం. Advertisement బెదిరింపులు, బిల్డర్ల…

ఒకటా రెండా.. కోడెల కుటుంబీకులపై పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల సంఖ్య పదుల్లోకి చేరింది. ఒకరకమైన అక్రమాలు కాదు, అనేక రకమైన అక్రమాల గురించి కోడెలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉండటం గమనార్హం.

బెదిరింపులు, బిల్డర్ల నుంచి వసూళ్లకు పాల్పడటం, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చేసిన వసూళ్లు, వ్యాపారాలు చేసుకునే వాళ్ల దగ్గర నుంచి పాల్పడిన దందా ఇలా మొదలుకుని.. భూ కబ్జాల  వరకూ వచ్చింది వ్యవహారం. ఇప్పటికే కోడెల తనయుడు శివరాం, కూతురు విజయలక్ష్మితో పాటు ఒక కేసులో కోడెల శివప్రసాద రావు మీద కూడా కేసు నమోదు అయ్యింది.

మాజీ స్పీకర్ కోడెలపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. తమది పచ్చి గాంధీగిరి కుటుంబం అని ఇటీవలే కోడెల ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. తాము ఎంతో ఉత్తములు అయినప్పటికీ తమ మీద అలాంటి కేసులు పెడుతూ  ఉన్నారని ఆయన వాపోయారు. ఇదంతా కక్ష సాధింపు అని ఆయన ప్రకటించుకున్నారు.

అయితే ఫిర్యాదుల పరంపర మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఈ కేసులన్నింటినీ జాయింటుగా విచారించేందుకు ఒక సిట్ ను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఉందట ప్రభుత్వం. ఇక కోడెల తనయ, తనయుడు ఇద్దరూ పరారీలో ఉన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ అక్రమాల వ్యవహారంలో వారి అరెస్టు తప్పకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు.