బాలయ్య.. నాగ్.. ఇద్దరూ డౌటేనా?

సంక్రాంతి సీజన్ అంటే ముందుంటారు హీరో బాలయ్య, నాగార్జున. అయితే 2020 సంక్రాంతికి మాత్రం ఈసారి ఇద్దరూ దూరంగా వుండే అవకాశం వుందని తెలుస్తోంది. బాలయ్య-కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో సినిమా జూలైలో ప్రారంభం…

సంక్రాంతి సీజన్ అంటే ముందుంటారు హీరో బాలయ్య, నాగార్జున. అయితే 2020 సంక్రాంతికి మాత్రం ఈసారి ఇద్దరూ దూరంగా వుండే అవకాశం వుందని తెలుస్తోంది. బాలయ్య-కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో సినిమా జూలైలో ప్రారంభం అవుతోంది. కెఎస్ రవికుమార్ సినిమా స్టార్ట్ చేస్తే, అన్నీ అందుబాటులో వుంటే మూడునెలల లోపే సినిమా తీసి పక్కన పెడతారు. అంటే దసరాకు కాస్త అటుగానే సినిమా రెడీ అయిపోతుంది.

అందువల్ల దానిని సంక్రాంతి వరకు మురగపెట్టే అవకాశం తక్కువ. బోయపాటి సినిమా ప్రారంభం కావాలి. దాని సంగతి తరువాత. అందువల్ల 2020 సంక్రాంతికి బాలయ్య దూరం అయ్యే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. ఇక నాగ్ బంగార్రాజు సినిమా సంక్రాంతికి అని వినిపిస్తోంది. కానీ ప్రస్తుతానికి సంక్రాంతికి వున్న మహేష్, బన్నీ, రజనీ సినిమాల పోటీ చూసాక నాగ్ కూడా మనసు మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

వెంకీ మామకు, బంగార్రాజుకు మధ్య చైతన్య వేరే సినిమా చేసే ఆలోచనల్లో వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలా కాకపోయినా, సంక్రాంతికి ముందే బంగార్రాజును బరిలోకి దింపేసే ఆలోచన కూడా ఆ సినిమా యూనిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తంమీద సీనియర్లు ఈసారి సంక్రాంతి బరిలో దిగడం లేనట్లు కనిపిస్తోంది.

ఆత్మవిమర్శ అవసరం.. టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!