కరోనా కేసుల పెరుగుదలలో ఇప్పుడు వేగం కనిపిస్తున్న దేశం రష్యా. పెద్ద జనాభా ఏమీ కాదు, ప్రపంచంలోనే అత్యంత విస్తీర్ణం ఉన్న దేశం, జన సాంద్రత చాలా చాలా తక్కువ. అందులోనూ ఒకరకమైన నియంతృత్వం. కాబట్టి లాక్ డౌన్ కూడా కష్టం కాదు. నెలన్నర కిందటే బాగా అలర్ట్ అయ్యింది కూడా! అయినా ఇప్పుడు రష్యాలో కేసుల సంఖ్య లక్షకు చేరువ అయ్యింది. ఆ సంఖ్య అలా పెరుగుతూ వస్తోంది.
అభివృద్ధి చెందిన దేశం కావడం, మెరుగైన వైద్య సేవల నేపథ్యంలో.. ఎక్కువ సంఖ్యలో టెస్టులో జరిగి ఉండొచ్చు. కాబట్టి కేసుల సంఖ్య కూడా ఎక్కువగా బయటపడుతూ ఉండొచ్చు, అయితే ఇలా రష్యాలో కేసుల సంఖ్య బాగా పెరిగిపోవడం వెనుక కారణం.. చైనాతో ఆ దేశానికి గల సత్సంబంధాలే అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.
రష్యాతో, చైనాకు చాలా సత్సంబంధాలున్నాయి. ప్రత్యేకించి చైనీయులకు రష్యా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. చైనాతో పోల్చుకుంటే రష్యాలో టూరిస్టు అట్రాక్షన్లు చాలా ఉన్నాయి. ప్రత్యేకించి రష్యాలోని యూరప్ పార్ట్ కు చైనా టూరిస్టులు విపరీతంగా వెళ్తారు.
అదీ కథ. చైనా టూరిస్టులతో రష్యాలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపించిందని ఇప్పుడు అంచనా వేస్తూ ఉన్నారు. మొదట్లో రష్యాలో కరోనా ప్రభావం అంతగా కనిపించలేదు. చైనాతో సరిహద్దులను రష్యా మూసేసే సమయానికే టూరిస్టుల ద్వారా కరోనా వైరస్ రష్యాకు చేరిపోయింది. చాప కింద నీరులా అది అంటుకుపోయింది. మొదట్లో లైట్ తీసుకున్న రష్యా కు పరిస్థితి ఎంత ముదిరిపోయిందో ఇప్పుడు అర్థం అవుతూ ఉన్నట్టుంది. మరి ఈ విషయంలో రష్యా ఎవరిని నిందిస్తుందో! చైనానేనా? చైనాను రష్యా నిందించగలదా?