కరోనా టీకా వస్తోంది… కానీ అందరికీ కాదు

జనవరి నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ మేరకు దేశీయంగా అభివృద్ధి చేస్తున్న 3 టీకాలు తుదిదశకు చేరుకోవడంతో పాటు.. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా…

జనవరి నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ మేరకు దేశీయంగా అభివృద్ధి చేస్తున్న 3 టీకాలు తుదిదశకు చేరుకోవడంతో పాటు.. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన వాక్సీన్ ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది.

అయితే కరోనా టీకా అందరికీ అవసరం లేదంటోంది కేంద్రం. దేశ జనాభాలో 20శాతం మంది టీకా వేయించుకుంటే సరిపోతుందని చెబుతోంది. ఫ్రంట్ లైన్ సిబ్బంది తో పాటు.. 50 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ముందుగా టీకా ఇస్తే.. కరోనా ముందునాటి సాధారణ పరిస్థితుల్ని పునరుద్ధరించొచ్చని అభిప్రాయపడుతోంది. 

ఆ తర్వాత దశలవారీగా అందరికీ టీకా ఇచ్చే కార్యక్రమాన్ని నిదానంగా అమలు చేయొచ్చని భావిస్తోంది. ఈ మేరకు టీకా ఇచ్చేందుకు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా ఫ్రంట్ లైన్ సిబ్బందికి, 50 ఏళ్లు దాటిన వ్యక్తులకు ముందుగా టీకా ఇస్తారు. వాళ్లలో కూడా 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తారు. 

వాక్సిన్ కేంద్రంలో కనీసం ఒక రోజులో 200 మందికి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. వాక్సీన్ తీసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా కేంద్రం అభివృద్ధి చేసిన కో-విన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

కరోనా వైరస్ సోకినప్పుడు ఎలాగైతే వైద్య సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది పని చేశారో.. వ్యాక్సినేషన్ ప్రక్రియ టైమ్ లో కూడా అలానే పనిచేయాలి. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కనుక్కోవాలి. ఏమైనా సైడ్ ఎఫెక్టులు ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు ఆరా తీయాలి.

ఇలా తొలి దశలో 25 కోట్ల నుంచి 30 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న టీకాలు కూడా అందుబాటులోకి వస్తే, ప్రైవేటు హాస్పిటల్స్ లో కూడా కరోనా టీకా ఇచ్చే అవకాశాలున్నాయి. 

అటూ ఇటూ ఎటూ కాలేక!