ఈసారి పక్కా… పట్టాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్

ఈ ఏడాది మార్చి నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూనే వస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని అడ్డుకుంటూ చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించి తమాషా చూస్తున్నారు.  Advertisement ఉగాది నాటికి తొలివిడత…

ఈ ఏడాది మార్చి నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూనే వస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని అడ్డుకుంటూ చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించి తమాషా చూస్తున్నారు. 

ఉగాది నాటికి తొలివిడత మొదలు కావాల్సి ఉన్నా.. ఇప్పటి వరకూ పురోగతి లేదు. అటు లే-అవుట్లు సిద్ధం చేసి, లాటరీ తీసి, క్షేత్ర స్థాయిలో అంతా సిద్ధం చేశారు రెవెన్యూ అధికారులు. ఇటు కోర్టు తీర్పు రాకపోవడంతో పదే పదే ఈ ప్రక్రియ వాయిదా పడి అధికారుల్లో కూడా నైరాశ్యం నెలకొంది.

ఈ నేపథ్యంలో పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. కొంతమంది స్వార్థపరులు కోర్టుల్లో కేసులు వేసి, స్టేలు తెచ్చుకున్న ప్రాంతాలను మినహాయించి.. మిగతా అన్ని చోట్ల ఇళ్ల పట్టాల పంపిణీని ప్రారంభించాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు డిసెంబర్ 25న ఇళ్లపట్టాల పంపిణీ చేపట్టబోతున్నారు.

డిసెంబర్ 25న అర్హులందరికీ డి-ఫారమ్ పట్టాలిచ్చి ఇళ్ల స్థలం కేటాయిస్తారు. అంతేకాదు.. అదే రోజు ఇళ్ల నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టబోతున్నారు. ఇలా తొలి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టబోతున్నారు.

తాజా నిర్ణయంతో జగన్ రెండు విషయాల్లో పైచేయి సాధించబోతున్నారు. వీటిలో ఒకటి తను అనుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఇదే ఏడాదిలో మొదలు పెట్టబోతున్నారు. ఇక రెండోది ఏఏ ప్రాంతాల్లోనైతే స్టేలు వచ్చాయో.. ఆ ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణాల్ని చూస్తారు. కోర్టులో కేసులు వేసి స్టేలు తెచ్చిన వాళ్లను అసహ్యించుకుంటారు. ఇలా ఒకేసారి రెండు పనులు పూర్తిచేస్తారు జగన్.

నిజానికి జులై 8కే ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నారు జగన్. కానీ బాబు, అతడి బినామీలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో పేదలకు భూములు దక్కకుండా కోర్టు కేసులు వేశారు. 

ఇలాంటి వ్యక్తుల బండారం బయటపెట్టాలంటే.. మిగతా ప్రాంతాల్లో పండగలా పట్టాల పంపిణీ జరగాల్సిందే. ఉద్యమంలా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిందే. జగన్ ఇప్పుడు అదే చేయబోతున్నారు.

పేదలకు ఇళ్లంటే గత ప్రభుత్వం ఇచ్చినట్టు అవి అగ్గిపెట్టెల్లా ఉండవు. విశాలమైన రోడ్లు, పార్కులు, పాఠశాలలు, హాస్పిటల్, ఇలా సకల సౌకర్యాలతో ఇళ్లు కట్టించి ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి జగన్.

నిమ్మగడ్డ ఓ అజ్ఞాతవాసి: కొడాలి నాని