ఒక్క నిమ్మగడ్డ అనుకుంటే ఎన్నికలు జరిగిపోతాయా…?

రాష్ట్రంలో కరోనా కేసులు ఒకటి రెండు ఉన్నపుడు ఎన్నికలు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్  రోజుకు వేల కేసులు నమోదు అవుతూంటే ఎన్నికలు పెడతామని చెప్పడం విడ్డూరమే. Advertisement…

రాష్ట్రంలో కరోనా కేసులు ఒకటి రెండు ఉన్నపుడు ఎన్నికలు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్  రోజుకు వేల కేసులు నమోదు అవుతూంటే ఎన్నికలు పెడతామని చెప్పడం విడ్డూరమే.

ఇదే విషయాన్ని వైసీపీ సీనియర్ నేత దాడి రత్నాకర్ గట్టిగా నిలదీస్తున్నారు. చేతిలో పెన్ను ఉంది కదా అని ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ఎన్నికలు పెట్టేస్తామంటే  కుదురుతుందా. అసలు అది జరిగే విషయమేనా అని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికలు జరిపించాలంటే ఎంత పెద్ద యంత్రాంగం ఉండాలో తెలియదా అని ఆయన నిమ్మగడ్డని నిలదీశారు. రాష్ట్రంలో 680 మండల పరిషత్తులు, జెడ్పీటీసీలు, మరో 9369 ఎంపీటీసీలు, అలాగే పద్నాలుగు కార్పొరెషన్లు, 88 మునిసిపాలిటీలు. ఇంకా ఎన్నో వార్డులకు ఎన్నికలు జరపాల్సి ఉంది.

అది నిమ్మగడ్డ ఒక్కరి వల్ల అయ్యే పనేనా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల సన్నద్ధతను కూడా తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఇపుడున్న పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ ఉందని వార్తలు అందరిలో భయాన్ని కలిగిస్తున్నాయని దాడి అన్నారు.

మరి ఈ సమయంలో ఎన్నికలు పెడితే ప్రజలు కూడా భయంతో ఓటింగుకు రారని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సిబ్బంది కూడా రాలేరని ఆయన అన్నారు. వీరిలో ఎవరికైనా కరోనా వస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారని కూడా ఆయన అంటున్నారు.

నిమ్మగడ్డకు ముందు ఎంతో మంది ఎన్నికల అధికారులుగా పనిచేసినా ఎపుడూ వివాదాలు రాలేదని, ఆయన కూడా తన పంతాన్ని వీడి ప్రభుత్వానికి సహకరించాలని దాడి కోరారు. మొత్తానికి నిమ్మగడ్డ ఉత్సాహానికి ఇది ఓ విధమైన ఆలోచింపచేసే సమాధానమేమో.

నిమ్మగడ్డ ఓ అజ్ఞాతవాసి: కొడాలి నాని