జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ రెండు రోజులు వుంటారు. ఆయనతో పాటు పార్టీ లెఫ్టినెంట్ నాదెండ్ల మనోహర్ కూడా వెళ్లారు.
భాజపా అధ్యక్షుడు జెపి నడ్డా ను కలవడానికి పవన్ వెళ్లినట్లు జనసేన వర్గాల బోగట్టా. నడ్డాతో పాటు వీలయితే అమిత్ షాను కూడా కలిసే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది.
అపాయింట్ మెంట్ లు దొరికితే పలువురు భాజపా నాయకులను కలిసే ఆలోచనలో వున్నారని, అందువల్లనే రిటర్న్ జర్నీ ఎప్పుడు అన్నది పక్కాగా లేదు అని తెలుస్తోంది.
రెండు రోజులు ప్రచారం?
ఇదిలా వుంటే జిహెచ్ఎంసి ఎన్నికల్లో రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశం వుందని తెలుస్తోంది.
28,29 తేదీల్లో పవన్ ప్రచారం లిమిటెడ్ లొకేషన్స్ లో వుంటుందని తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ జనాలు రోడ్ మ్యాప్ తయారుచేస్తున్నారు.
భాజపా నేతలతో మాట్లాడి పవన్ ప్రచారం ఎక్కడ చేస్తే బాగుంటుంది అన్న విషయాలు సేకరించి, దానికి అనుగుణంగా రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారు.