తెలుగుదేశం పార్టీ అనుకూల సామాజిక మీడియా బలగం పొట్టి సీతయ్య టైపు. ఇలా వస్తే అలా అంటాం..అలా వస్తే ఇలా అంటాం అనే రకం.
జనాలకు డబ్బులు ఇచ్చే పథకాలు అమలు చేస్తే అప్పుల పాలవుతోంది రాష్ట్రం అంటాం. ఇవ్వకపోతే జనం అల్లాడిపోతున్నారు అంటాం. ఆంధ్రలో అత్యంత పాపులర్ అయిన జగన్ స్కీమ్ అమ్మఒడి. ఈ ఏడాది అమ్మ ఒడి స్కీమును సంక్రాంతి నుంచి సమ్మర్ కు మార్చారు.
దీంతో దేశం అనుకూల సామాజిక మీడియా మాట మార్చింది. అదిగో అమ్మ ఒడి లేక ఈసారి పల్లెల్లో సంక్రాంతి కాంతులు లేవు. అంతా బోసిపోయింది అంటోంది. నిజానికి ఈసారి పంటలు పుష్కలంగా పండాయి. మూడు పంటలు పండే జిల్లాల్లో ఓ పంటకు సమస్య వచ్చిన మాట వాస్తవం. ఆ సంగతి పక్కన పెడితే మిగిలిన పంటలు బాగా పండాయి. ఒక్క పంట పండే జిల్లాల్లో కూడా మంచి పంటలు పండాయి.
కానీ మన దేశం అనుకుల సామాజిక మీడియాకు ఇవన్నీ కనిపించవు కదా. ఏదో ఒకటి వండి వార్చడమే.అందుకే పంటలు లేవు. అమ్మఒడి లేదు ఇంకేం సంక్రాంతి అంటోంది. అదే నిజం అనుకుని లోకేష్ నాయుడు కూడా వచ్చే ఏడాది అయినా పంటలు బాగా పండాలి అంటున్నారు. నిజానికి ఆయన తన పార్టీ వర్గాలను అడిగి నివేదిక తెప్పించుకోవచ్చు కదా. పంటలు బాగా పండాయో లేదో?
అయినా వేలాది ఎకరాల పచ్చని పంటభూములను రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మార్చేసిన పార్టీ నేత ఆయన. ఇప్పుడు ఆయన కూడా పంటల గురించి మాట్లాడుతున్నారంటే ఏం అనుకోవాలి? ఒకప్పుడు అన్నపూర్ణ అనుకున్న ఆంధ్ర ఇప్పుడు రియల్ ఎస్టేట్ దిశగా సాగిపోతోంది. దాంతో సాగు భూములు అన్నీ ఇళ్ల స్థలాలుగా మారిపోతున్నాయి.
ఇలాంటి వ్యవహారం తెలియనట్లు, రైతుల గురించి పంటల గురించి, సంక్రాంతి సంబరాల గురించి మాట్లాడుతున్నారు అంటే ఏమనుకోవాలి.