గత కొన్నాళ్ళుగా ఏపీలో ఒక హాట్ టాపిక్ సైడ్ అయిపోయింది. బహుశా తిరుపతి ఎన్నికల ముందు వరకూ కూడా అదే ఏపీలో హైలెట్. కానీ కొన్నాళ్ళుగా ఆ ఊసే లేదు అనుకుంటే సిక్కోలులో ఒక్కసారిగా మళ్ళీ విద్వంశ రచన మొదలైంది.
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం క్షేత్రం సమీపంలోని పద్మనాభ కోదండస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం తాజాగా చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఇక్కడి వినాయకుడు, సరస్వతి అమ్మవారు, మహిషాసుర మర్దని విగ్రహాలపై దాడులు చేశారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది.
మరి ఈ విగ్రహాల విద్వంశం ఎందుకు జరిగింది. దీని వెనక వ్యక్తులు, శక్తులు బయటకు వస్తారా అంటే చూడాల్సి ఉంది. ఇక అప్పట్లో అంటే ఆ మధ్య దాకా హిందూ విగ్రహాలపై దాడులు వరసపెట్టి జరిగేవి.
మరి ఇటీవల అలాంటి దారుణాలు లేవని ప్రజలు అంతా హ్యాపీగా ఉన్నారు. దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవడం వల్లనే అవి ఆగాయని కూడా భావించారు. కానీ మళ్ళీ సిక్కోలు నుంచే ఇది మొదలు కావడం అంటే ఇకపైన ఇలాంటి వార్తలను ఇంకెన్ని వినాల్సి వస్తుందోనని ఆస్తిక జనులు కలవరపడుతున్నారు.