అవును.. అందాల విశాఖ బీచ్ వద్దకు వెళ్లవద్దు అంటున్నారు అధికారులు. అది కూడా వీకెండ్స్ లో అసలు రానే రావద్దు, ఇక పండుగలు, ఇతర సెలవుల వేళలలో అక్కడ అసలు కనిపించవద్దు అని కూడా స్పష్టంగా చెప్పేస్తున్నారు.
మరి విశాఖ సాగర తీరం అంటేనే జనాలకు అదో రకమైన మోజు. ఏదో టైమ్ లో బీచ్ కి వెళ్ళేవారే ఎక్కువ మంది ఉంటారు. ఇక వీకెండ్స్ అయితే జనాలతో జాతరనే తలపిస్తాయి ఈ పరిసరాలు. అందుకే విశాఖ జిల్లా అధికార యంత్రాంగం తాజాగా కట్టుదిట్టమైన హెచ్చరికలను జారీ చేసింది. బీచ్ కి రావద్దు, షికార్లు చేయవద్దు అంటూ గట్టిగానే ఆదేశాలిచ్చింది.
ఇదంతా కరోనా మూడవ దశను దృష్టిలో పెట్టుకుని విశాఖ అధికారులు చేస్తున్న ముందస్తు కట్టడి. దాంతో విశాఖలో తగ్గుతున్న కరోనా నంబర్లను చూసి ఇక హ్యాపీగా కెరెటాలతో ఆడుకోవచ్చు అంటూ సంబరపడిన వారందరికీ ఇది చేదు వార్తగానే ఉంది. అయితే మూడవ దశ కరోనా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని కూడా ఎవరూ తప్పుపట్టలేరు.
మొత్తానికి టౌన్ పక్కకెళ్ళి డౌన్ అయిపోయిన వెనకటి పల్లెటూరి ఆసామి కధ లాగా బీచ్ లకూ షికార్లకు వెళ్తే మాత్రం కరోనాను గిఫ్ట్ గా ఇంటికి మోసుకెళ్ళాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. సో కొన్నాళ్ళపాటు సరదాలు విహారాలు బంద్ అంతే.