దేవినేని ఉమ‌.. ఇదేనా మీ ధైర్యం!

అధికారం కోల్పోయిన ద‌గ్గ‌ర నుంచి ఒక్కొక్క‌రిగా పారిపోవ‌డం తెలుగుదేశం నేత‌ల‌కూ, ఆ పార్టీ సానుభూతి ప‌రుల‌కూ అల‌వాటు అయ్యింది. ఈ క్ర‌మంలో ఆ జాబితాలో మ‌రో నేత ఎక్కారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్…

అధికారం కోల్పోయిన ద‌గ్గ‌ర నుంచి ఒక్కొక్క‌రిగా పారిపోవ‌డం తెలుగుదేశం నేత‌ల‌కూ, ఆ పార్టీ సానుభూతి ప‌రుల‌కూ అల‌వాటు అయ్యింది. ఈ క్ర‌మంలో ఆ జాబితాలో మ‌రో నేత ఎక్కారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగాల‌ను క‌ట్ అడ్ పేస్ట్ ల ఎడిట్ తో వీడియోలు త‌యారు చేసి, వాటిని ప్ర‌ద‌ర్శించిన తెలుగుదేశం నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నారు. 

ఆయ‌న‌కు సీఐడీ నోటీసుల నేప‌థ్యంలో ఉమ ఎవ‌రికీ దొర‌క్కుండా ప‌రార్ అయిన‌ట్టుగా స‌మాచారం. ఈ మేర‌కు సీఐడీ అధికారులు ఆయ‌న ప‌రారీని ధ్రువీక‌రించారు. ఆయ‌న సెల్ ఫోన్ కూడా స్విచ్ఛాప్ చేసుకుని ప‌రార్ అయిన‌ట్టుగా స‌మాచారం.

ఇది వ‌ర‌కూ ప‌లువురు టీడీపీ నేత‌లు ఇలా పరార్ అయ్యారు. మొద‌ట్లో కోడెల త‌న‌యుడు ప‌రారీ, ఆ త‌ర్వాత మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌, ఇంకో టీడీపీ నేత కూన ర‌వికుమార్ అయితే అనేక కేసుల్లో ప‌రారీలో ఉంటున్నారు. ఇప్పుడు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు కూడా అదే త‌ర‌హాలో పరార్ అయ్యారు. 

ఇక తెలుగుదేశం సానుభూతి ప‌రుడు ఒక‌ప్ప‌టి టీవీ9 సీఈవో ర‌విప్ర‌కాష్ కూడా కొంత‌కాలం పాటు పారిపోయి దాక్కొన్నారు. ఇటీవ‌లే ఆళ్ల‌గ‌డ్డ నేత‌లు, భూమా అఖిల‌ప్రియ బ‌ర్త ఒక కేసులో చివ‌రి వ‌ర‌కూ దొర‌క్కుండా దాక్కొన్నారు. ప‌రారీ నుంచినే భార్గ‌వ్ రామ్, భూమా జ‌గ‌త్ విఖ్యాత్ లు బెయిల్ తెచ్చుకుని బ‌య‌ట‌ప‌డ్డారు. 

ప‌దే ప‌దే ప్ర‌త్య‌ర్థులు నిజాయితీని నిరూపించుకోవాల‌ని, జైలుకు వెళ్లాల‌ని డిమాండ్ చేసే టీడీపీ నేత‌లు త‌మ వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి చిన్న చిన్న కేసుల్లో కూడా ప‌రారీనే న‌మ్ముకోవ‌డం గ‌మ‌నార్హం. 

త‌ప్పులు చేసి, కేసుల్లో చిక్కుకుని, వాటిల్లో నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేయ‌కుండా వీరు ప‌రారీ అవుతున్నారు. ఉద‌యం లేస్తే నీతీ, నిజాయితీ అంటూ చ‌చ్చుపుచ్చు ప్ర‌సంగాలు చేసే దేవినేని ఉమ  ఇలా పారిపోయి త‌న స‌చ్ఛీల‌త ఎంతో నిరూపించుకుంటున్న‌ట్టు గా ఉన్నారు!