స్వాములు ఉన్నది సేవ చేసేందుకే. ఆధ్యాత్మికత కూడా సేవలో భాగం. అది గొప్ప వరం కూడా. స్వాంతన కలిగించేందుకు స్వాములు ఉంటారు. వారు వేద వేదాంగాల్లో పండితులు. అటువంటి స్వాములకు ఇహంతో పనిలేదు. కానీ వారు చేసే కార్యాలకు మాత్రం ఇతోధిక సాయం కావాలి.
అందుకే విశాఖ శారదాపీఠానికి ప్రభుత్వం పదిహేను ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ వేద పాఠశాలను నిర్మించడం ద్వారా భావి తరాలకు వేద విద్యలో శిక్షను ఇస్తారు. చాలా కాలంగా వేద పాఠశాలను ఏర్పాటు చేయాలని పీఠం భావిస్తోంది.
మొత్తానికి ఇన్నాళ్ళకు ఆ కల ఈడేరింది అని పీఠం నిర్వాకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పాతికేళ్ల క్రితం పెందుర్తి కేంద్రంగా శారదాపీఠం ఏర్పాటు అయింది. నాడు చిన్నగా మొదలైన ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఈ రోజు దేశం నలుమూలలా ఖ్యాతి గడించింది.
ఇపుడు దీనికి అనుబంధంగా వేద పాఠశాల ఏర్పాటు కావడం పట్ల ఆధ్యాత్మికవాదులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం వైసీపీ సర్కార్ హిందువులకు హిందూత్వానికి అన్యాయం చేస్తోందని తప్పుడు ప్రచారం చేసిన కొన్ని విపక్షాలకు ఈ నిర్ణయం ఏ కోశానా మింగుడు పడడంలేదనే చెప్పాలి.