వివాదాస్పద విమర్శకుడు కత్తి మహేష్ కు ప్రమాదం జరిగి చాలా రోజలు అయింది. అతను మరణించి కూడా మూడు రోజులు అయిపోయింది. కానీ ఇప్పుడు కొత్తగా అనుమానాలు తలెత్తుతున్నాయి.
అసలు కత్తి మహేష్ మృతి ప్రమాదమేనా? లేక కుట్ర కోణం ఏమైనా వుందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి కారణం మాదిగ పోరాట సమితి నాయకుడు మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలే.
ఆయన స్వయంగా అనుమానాలు వ్యక్తం చేయడంతో కత్తి మృతి మీద సందేహాలు ముసురుకుంటున్నాయి. కారు ఎదర భాగం నుజ్జు నుజ్జు అయినా డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో ఎలా బయటపడ్డాడు అన్నది మంద కృష్ణ మాదిగ రెకెత్తించిన అనుమానం. ప్రమాదంలో ఒక్కోసారి మిరాకిల్స్ జరుగుతుంటాయి.
ఎంత దారుణ ప్రమాదం అయినా స్వల్ప గాయాలతో బయటపడ్డవారు వుంటారు. చిన్న ప్రమాదంలో మరణించిన వారు వుంటారు. కత్తికి జరిగిన కారు ప్రమాదం దారుణమైనదే.
కారు ఎదర బాగం మొత్తం నుజ్జు నుజ్జు అయింది. అయితే సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల డ్రయివర్ సేఫ్ అయ్యాడని, కత్తి సీటు బెల్ట్ పెట్టుకోలేదని అప్పుడే వార్తలు వచ్చాయి. అంటే ప్రమాదం మీద క్లారిటీ ఇచ్చినట్లే.
అయినా కృష్ణ మాదిగకు ఎందుకు సందేహం కలిగినట్లో? దానికి ఆయన ఏమంటున్నారంటే, కత్తి మహేష్ ఎందరికీ టార్గెట్ గా మారాడాని అందుకే అనుమానమని అంటున్నారు.
అక్కడితో ఆగడం లేదు. ప్రమాదం మీద సరైన అధికారితో దర్యాప్తు చేయించాలని కూడా కృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నారు.