టర్కీలో సునామీ.. భారీగా ఆస్తి నష్టం

టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. ఏజియన్ సముద్రంలో ఈ భూకంపం రావడంతో సునామీ వచ్చింది. టర్కీలోని ప్రముఖ పర్యాటక నగరం ఐజ్మీర్ ను భూకంపం-సునామీ వణికించింది. పలు ప్రాంతాల్లో భవనాలు నేలమట్టం కాగా.. నగరంలోకి…

టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. ఏజియన్ సముద్రంలో ఈ భూకంపం రావడంతో సునామీ వచ్చింది. టర్కీలోని ప్రముఖ పర్యాటక నగరం ఐజ్మీర్ ను భూకంపం-సునామీ వణికించింది. పలు ప్రాంతాల్లో భవనాలు నేలమట్టం కాగా.. నగరంలోకి సముద్రపు నీరు ప్రవేశించింది.

ఇప్పటివరకు నలుగురు మరణించినట్టు అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం. అయితే మృతుల సంఖ్య వందకు పైగా ఉండొచ్చనేది అనధికారిక సమాచారం. 

ఏజియన్ సముద్రంలో 16.5 కిలోమీటర్ల తోతున, గ్రీక్ ఐలాక్ సామోస్ కు 13 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు అమెరికా జియలాజికల్ సర్వే ప్రకటించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రతను 7గా నమోదైనట్టు ప్రకటించింది.

భూకంపం కారణంగా సునామీ ఏర్పడి సముద్రపు నీరు ఐజ్మీర్ మెట్రోపాలిటన్ సిటీని చుట్టుముట్టింది. సముద్రం ఒడ్డున ఉన్న కొన్ని ఇళ్లు పూర్తిగా నీటమునగగా, చాలా ఇళ్లు పాక్షికంగా మునిగిపోయాయి.

గ్రీస్ రాజధాని ఏధెన్స్ లో కూడా భూకంపం సంభవించింది. ప్రాణ-ఆస్తి నష్టానికి సంబంధించి అధికారిక వివరాలు ఇంకా బయటకురాలేదు.

జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయం